Homeఎంటర్టైన్మెంట్Adivi Sesh counter to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కే కౌంటర్ ఇచ్చిన...

Adivi Sesh counter to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కే కౌంటర్ ఇచ్చిన అడివి శేష్.. సంచలనం రేపుతున్న వీడియో..

Adivi Sesh counter to Pawan Kalyan: అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్'(Dacoit Movie) బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. దాదాపుగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడివి శేష్ నుండి వచ్చిన ఈ చిత్రానికి ఆరంభం లో కాస్త నెగెటివ్ టాక్ వచ్చింది కానీ , ఈ సమ్మర్ లో అంతకు మించిన సినిమా మరొకటి లేకపోవడం తో కమర్షియల్ గా సూపర్ హిట్ అంచులకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు + హిందీ వెర్షన్స్ కలిపి 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , క్లోజింగ్ లో 60 కోట్ల రూపాయిల రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయగా , అందులో అడివి శేష్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘చాలా మంది ఈ చిత్రం నా క్రెడిబిలిటీ వల్ల ఆడిందని అంటున్నారు . అందుకు చాలా ధన్యవాదాలు. కానీ నేను ఆడియన్స్ ని అర్థం చేసుకున్నది ఏమిటంటే, నచ్చకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా తొక్కేస్తారు. ఒకవేళ నచ్చితే మాత్రం ఎంత కొత్తవాడి సినిమా అయినా సరే నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అడివి శేష్ ఈ మాటలు యాదృచ్చికంగా అన్నాడా ?, లేదా ఎవరినైనా ఉద్దేశించి అన్నాడా అంటూ సోషల్ మీడియా లో డిబేట్ నడుస్తోంది. కొంతమంది ఆయన పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కామెంట్ చేశాడని అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గానే ఆయన హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడానికి నానా తిప్పలు పడింది. దీనిపై పెద్ద చర్చ కూడా సోషల్ మీడియా నడిచింది. యాంటీ ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ట్రోల్స్ వేశారు. సోషల్ మీడియా ని రెగ్యులర్ గా అనుసరించే అడివి శేష్ , ఈ సినిమాని ఉదహరించే కామెంట్ చేశాడా ?, లేకపోతే మామూలుగానే యాదృచ్చికంగా కామెంట్ చేశాడా ? అంటూ విశ్లేషకులు కథనాలు చేస్తున్నారు. కానీ అడివి శేష్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన కుమారుడు అకిరా నందన్ తో అడివి శేష్ కి ఉన్న రిలేషన్ అన్నదమ్ముల బంధం కంటే స్ట్రాంగ్. అడివి శేష్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే అందుకు కారణం ‘పంజా’. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కాదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular