Homeఎంటర్టైన్మెంట్Siddharth- Aditi Rao Hydari: పెళ్ళైన సిద్ధార్థ్ తో అదితి రావ్ ఎఫైర్... ఆ పోస్ట్...

Siddharth- Aditi Rao Hydari: పెళ్ళైన సిద్ధార్థ్ తో అదితి రావ్ ఎఫైర్… ఆ పోస్ట్ తో ఫుల్ క్లారిటీ?

Siddharth- Aditi Rao Hydari: హీరో సిద్ధార్థ్ తో అదితి రావ్ హైదరి ఎఫైర్ నడుపుతున్నట్లు పుకార్లు చెలరేగాయి. దీనికి సిద్దార్థ్ సోషల్ మీడియా పోస్ట్ నిదర్శనం అంటున్నారు. అదితి రావ్ హైదరికి సిద్దార్థ్ బర్త్ డే విషెస్ చెప్పిన తీరు చూస్తుంటే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. అక్టోబర్ 28న అదితి రావ్ హైదరి 36వ బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిద్దార్థ్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరూ సన్నిహితంగా దిగిన ఫోటో పోస్ట్ చేసిన సిద్దార్థ్ … అందరి హృదయాల్లో కొలువున్న యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ ఆకాంక్షలు, కోరికలు, కలలు నెరవేరాలని కోరుకుంటున్నా.. అని కామెంట్ పోస్ట్ చేశారు .

Siddharth- Aditi Rao Hydari
Siddharth- Aditi Rao Hydari

ఇది వరకే సిద్దార్థ్ తో అదితి సన్నిహితంగా ఉంటున్నారన్న ప్రచారం జరిగింది. తాజా పోస్ట్ వీరి ప్రేమ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. 43 ఏళ్ల సిద్దార్థ్ గతంలో మౌనిక అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. మనస్పర్థలు తలెత్తడంతో 2007లో విడిపోయారు. తర్వాత చాలా మంది హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపినట్లు వార్తలు వినిపించాయి. ఈ లిస్ట్ లో సమంత, శృతి హాసన్ వంటి టాప్ స్టార్స్ ఉన్నారు.

తాజాగా అదితికి దగ్గరయ్యాడంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అదితి కూడా పెళ్ళై విడాకులు తీసుకున్నారు. 21 ఏళ్ల వయసులో నటుడు, లాయర్ అయిన సత్యదేవ్ మిశ్రాని అదితి రావ్ వివాహం చేసుకున్నారు. అయితే కెరీర్ కోసం ఆమె ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కొన్నాళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆమె సత్యదేవ్ మిశ్రాతో విడిపోయారు. విడాకులు తీసుకున్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగుతుందట. ఇప్పటికీ కలిసి మాట్లాకుంటూ ఉంటారట. తాజాగా ఆమె నటుడు సిద్దార్థ్ కి దగ్గరైనట్లు సమాచారం అందుతుంది.

Siddharth- Aditi Rao Hydari
Siddharth- Aditi Rao Hydari

గత ఏడాది విడుదలైన మహాసముద్రం చిత్రంలో సిద్దార్థ్-అదితి రావ్ కలిసి నటించారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ క్రైమ్ డ్రామా అనుకున్న స్థాయిలో ఆడలేదు. శర్వానంద్-అను ఇమ్మానియేల్ మరో జంటగా మహాసముద్రం మూవీలో నటించారు. సిద్దార్థ్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించి మెప్పించారు. ఇక కెరీర్ పరంగా చూస్తే అదితి రావ్, సిద్ధార్థ్ వెనుకబడ్డారు. సరైన సక్సెస్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఫేడ్ అవుట్ దశలో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Siddharth (@worldofsiddharth)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular