Adipurush Poster Copied: గతంలో ఎన్నడూ చూడనంత నెగిటివిటీ ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ చూస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుండి ఒక్కో వివాదం తెరపైకి వస్తుంది. విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంది. ఇక సోషల్ మీడియా నెగిటివ్ కామెంట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రూ. 500 కోట్లు ఖర్చుపెట్టి కార్టూన్ మూవీ తీశారా? అంటూ నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు. బాలీవుడ్ జనాలకు, ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ కి ఆదిపురుష్ టీజర్ ఆయుధంగా దొరికింది. ప్రభాస్ ని ఎగతాళి చేస్తూ ఆత్మసంతృప్తి పొందుతున్నారు. దర్శకుడు ఓం రౌత్ నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణం.

ఆయన కనీస జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. ఆదిపురుష్ లోని ప్రధాన పాత్రల లుక్స్ ఆయన డిజైన్ చేసిన తీరు వివాదాస్పదం అవుతుంది. ప్రేక్షకులకు రాముడు, రావణుడు, హనుమంతుడు గెటప్స్ నచ్చకపోగా సెంటిమెంట్స్ దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఈ క్రమంలో హిందూ వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. కొందరైతే ఆదిపురుష్ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు జారి చేస్తున్నారు.
Also Read: Godfather Collections: ‘గాడ్ ఫాదర్’ 2 వ రోజు వసూళ్లు..చరిత్ర తిరగరాసిన మెగాస్టార్
ఇది చాలదన్నట్లు ఆదిపురుష్ పోస్టర్ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటుంది. రాముడు ఉగ్రరూపంలో విల్లు పట్టుకొని యుద్ధ రంగంలోకి దూకుతున్నట్లున్న ఆ డిజైన్ మాదే అంటూ వానర యానిమేషన్ స్టూడియోస్ క్లైమ్ చేస్తున్నారు. మేము రూపొందించిన శివుడు కాన్సెప్ట్ డిజైన్ కాపీ చేశారని వారు ఆరోపిస్తున్నారు. కాపీ చేస్తే చేశారు, కనీసం ఆర్టిస్ట్ కి క్రెడిట్ ఇవ్వాలి కదా అని సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశారు. అలాగే ఆ స్టూడియో రూపొందించిన శివుడు పోస్టర్ పోస్ట్ చేశారు.

ఆదిపురుష్ పోస్టర్ తో వారు పోస్ట్ చేసిన శివుడు లుక్ చాలా దగ్గరగా ఉంది. ఇవన్నీ గమనిస్తుంటే ఓం రౌత్ పెద్దగా కష్టపడకుండా దొరికిన వాటిని సినిమాకు వాడుకుంటూ నచ్చినట్లుగా సినిమా తీసుకుంటూ పోయాడనిపిస్తుంది. రామాయణ మహాభారతాలు భారతీయ సంస్కృతిగా, ఆధ్యాత్మిక సంపదగా ప్రజలు భావిస్తారు. అలాగే అవి హిందువుల నమ్మకానికి సంబంధించిన ముఖ్య గ్రంధాలు. అలాంటి సబ్జెక్టులు తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాను రాను ఆదిపురుష్ ఇనెక్కి వివాదాలు రాజేయనుందో చూడాలి.
[…] […]
[…] […]