Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.యావత్తు భారత దేశ సినీ ప్రియులు ఈ సినిమాకోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. కేవలం హిందీ వెర్షన్ కి సంబంధించి ఇండియా వైడ్ గా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 8 కోట్ల రూపాయిలు దాటేసింది సమాచారం.
కేవలం నార్త్ ఇండియా నుండి ఈ చిత్రం ఆల్ టైం డే 1 రికార్డు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈ సినిమాకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఓవర్సీస్ లో ప్రభాస్ తో కలిసి కొంతమంది సినీ ప్రముఖులు మరియు మీడియా ప్రముఖులతో ‘ఆదిపురుష్’ మూవీ ప్రివ్యూ షో చూసారు.
ఈ షో చూసిన ప్రతీ ఒక్కరు ఎంత అద్భుతంగా తీసావు, 3D అనుభూతి ఈమధ్య కాలం లో హాలీవుడ్ సినిమాలకు కూడా ఈ స్థాయిలో పొందలేదు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూస్తే 3D లోనే చూడాలి అంటూ కామెంట్స్ చేసారు. ఈ చిత్రం మూడు గంటల సమయం ఉన్నప్పటికీ అప్పుడే అయిపోయిందా అనేంత లాగ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రానికి అందించిన స్క్రీన్ ప్లే విధానం అద్భుతమని కొనియాడారు.
రామసేతు నిర్మించే సన్నివేశం, ఆంజనేయుడు లంక మొత్తాన్ని తగలబెట్టే సన్నివేశం, రామ రావణ యుద్ధం, వాలీ సుగ్రీవుడు మధ్య యుద్ధం, ఇలా ప్రతీ సన్నివేశాన్ని వెండితెర మీద చూసిన అనుభూతిని చిరకాలం గుర్తించుకుంటామని, ఈ సినిమాని చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూసేవిధంగా డైరెక్టర్ ఈ చిత్రాన్ని మలిచాడని తెలుస్తుంది. రాముడిగా ప్రభాస్ నటన అద్భుతం, ఇక సీత పాత్రలో కృతి సనన్ నటించలేదు, జీవించింది అనే చెప్పాలి. సినీ ప్రముఖులే ఇంత ఎమోషనల్ గా గురై ఈ రేంజ్ పాజిటివ్ టాక్ చెప్తే. ఇక ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.