
Adipurush’ Movie Leak : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాలలో ‘ఆది పురుష్’ చిత్రం పై ఫ్యాన్స్ లోనే అసంతృప్తి ఉన్న సంగతి తెలిసిందే.ఎందుకంటే ఈ సినిమా కి సంబంధించిన టీజర్ కార్టూన్ ఛానల్ లో చూసినట్టు గా ఉందని, 500 కోట్లు ఖర్చు చేసి, మా హీరో విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఇన్ని రోజులు మీరు తీసిన ఔట్పుట్ ఇదా అంటూ ఫ్యాన్స్ డైరెక్టర్ ఓం రౌత్ ని ట్యాగ్ చేసి ఇష్టమొచ్చినట్టు తిట్టారు.
ఫ్యాన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ని గమనించిన మూవీ టీం, గ్రాఫిక్స్ రీ వర్క్ చేయించడం కోసం మరో ఆరు నెలల సమయం తీసుకున్నారు.ఇప్పుడు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుందట.ఈసారి గ్రాఫిక్స్ వర్క్ కళ్ళు చెదిరిపొయ్యే రేంజ్ లో వచ్చిందని, కచ్చితంగా ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారని అంటున్నారు మూవీ టీం.ఈ సినిమాని జూన్ 16 వ తేదీన ప్రపంచవ్యాప్యంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా విడుదలకు ముందే HD ప్రింట్ తో ఆన్లైన్ లో లీక్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఎందుకంటే ఈ సినిమాని త్వరలోనే న్యూయార్క్ లో జరగనున్న ట్రై బెకా ఫిలిం ఫెస్టివల్ లో జూన్ 13 వ తారీఖున ప్రదర్శించబోతున్నారట.ముందుగా విడుదల చేస్తున్నారు కాబట్టి, కచ్చితంగా ఆన్లైన్ లో లీక్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.ఒకవేళ అదే కనుక జరిగితే ఆదిపురుష్ టీం కి భారీ నష్టం వాటిల్లక తప్పదని అంటున్నారు.
అయితే ముందుగా ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించడం వల్ల పాజిటివ్ టాక్ బాగా ప్రచారం అవుతుందని, తద్వారా ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయని, అందుకే ఓం రౌత్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు.మరి ముందుగా ప్రివ్యూ షో వెయ్యడం అనేది, ఆది పురుష్ కి ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనేది తెలియాలంటే జూన్ వరకు ఆగాల్సిందే.