https://oktelugu.com/

Adipurush Final Trailer : ‘ఆదిపురుష్’ యాక్షన్ ట్రైలర్..మాటల్లేవ్..లెక్క ఎక్కడ నుండి మొదలవుద్దో!

ఈ ట్రైలర్ లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా అనిపించింది. దీనిని థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : June 6, 2023 / 09:48 PM IST
    Follow us on

    Adipurush Final Trailer : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు తిరుపతి లో కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. ఈ ట్రైలర్ మొదట విడుదల చేసిన ట్రైలర్ కంటే అద్భుతంగా ఉంది. మొదటి ట్రైలర్ లో మొత్తం రామాయణం ఓవర్ వ్యూ చూపించగా, రెండవ ట్రైలర్ లో ఎక్కువగా రామ మరియు రవాణా యుద్ధం, సీతని రావణాసురుడు అపహరించడం వంటివి చూపించారు.

    ఇలాంటి గ్రాఫిక్స్ తో ఇప్పటి వరకు రామాయణం మీద ఎవ్వరూ సినిమాలు తియ్యలేదు. మొట్టమొదటి సారి రామాయణం ని ఆ గ్రాఫిక్స్ లో చూసేసరికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ చాలా థ్రిల్ కి గురి అయ్యారు. కచ్చితంగా థియేటర్ లో చూడాల్సిందే అని అనిపించేలా చేసింది ఈ ట్రైలర్.

    ఈ ట్రైలర్ లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా అనిపించింది. దీనిని థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. మొదటి ట్రైలర్ లో కూడా ప్రభాస్ చాలా డల్ డైలాగ్ డెలివరీ తో కానిచ్చేశాడు. సినిమాలో డబ్బింగ్ బాగుంటాడని అందరూ అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా విడుదల చేసిన ట్రైలర్ లో మాత్రం అలా అనిపించలేదు.

    ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా చూపించారు. అయితే లాస్ట్ షాట్ లో రావణాసురిడి పది తలలు సరిగ్గా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక వానర సైన్యం మొత్తాన్ని మనం హాలీవుడ్ సినిమాలలో తప్ప, అంత న్యాచురల్ గా ఎప్పుడూ చూడలేదు. గ్రాఫిక్స్ మీద మూవీ టీం రీ వర్క్ కాస్త ఫలితానికి దక్కిన ప్రతిఫలం ఇది. చూడాలి మరి 16 వ తేదీ ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతోంది అనేది.