Director Om Raut- Prabhas: బాహుబలి తర్వాత ప్రభాస్ దేశంలోనే అతిపెద్ద స్టార్ గా ఎదిగారు. ఆయనతో మూవీ అంటే కనీసం రూ. 500 కోట్ల బడ్జెట్ కావాలి. ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాలన్నీ భారీ బడ్జెట్స్ తో తెరకెక్కుతున్నవే. కాగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. దానికి కారణం… ప్రభాస్ ఈ మూవీలో రామునిగా కనిపించనున్నారు. కెరీర్ లో మొదటిసారి ఓ పౌరాణిక చిత్రం చేస్తున్నారు. ఇక రాముని పాత్ర అంటే దశాబ్దాలుగా అదో క్రేజ్. ఈ పాత్ర ద్వారానే ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య నాయకుడు అయ్యారు. సిల్వర్ స్క్రీన్ పై ఆ పాత్రకు ఉన్న చరిత్ర అలాంటి మరి.

అసలు రాముని గెటప్ లో ప్రభాస్ ఎలా ఉంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ బాలీవుడ్ కి చెందినవాడు. అక్కడ చాలా మంది స్టార్స్ ఉండగా ఆదిపురుష్ కోసం ప్రభాస్ ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారనే సందేహం ఒకటి ఉంది. ఈ ప్రశ్నకు ఓం రౌత్ స్వయంగా సమాధానం చెప్పారు. ఆదిపురుష్ చిత్రంలో రామునిగా ప్రభాస్ ని ఎంచుకోవడానికి గల కారణం వివరించారు. ప్రభాస్ కళ్ళు చూసిన ఓమ్ రౌత్ ఆదిపురుష్ హీరోగా ఆయననే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఆయన మదిలోకి మరో హీరో రాలేదట.
Also Read: Chakravakam: చక్రవాకం నటులు ఏం చేస్తున్నారో తెలుసా?
కాబట్టి ప్రభాస్ కళ్ళు నచ్చిన ఓం రౌత్ పట్టుబట్టి ఆయన్ని హీరోగా తెచ్చుకున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆదిపురుష్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రామునిగా ప్రభాస్ లుక్ గూస్ బంప్స్ కలిగిస్తుందని దర్శకుడు హామీ ఇస్తున్నాడు. విఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో మూవీ తెరకెక్కుతుంది. ప్రభాస్ తన రెమ్యునరేషన్ గా రూ. 100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. 2023 సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ విడుదల కానుంది. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

ఇక ప్రభాస్ మరో రెండు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. సలార్, ప్రాజెక్ట్ కె సెట్స్ పై ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ 35 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె విడుదలకు చాలా సమయం పట్టే సూచనలు కలవు. దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ మూవీ సైన్ చేశారు. ఇది త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ ప్రకటించారు.
Also Read:Director Radha Krishna: రాధాకృష్ణకు కూడా సుజీత్ పరిస్థితేనా?
[…] […]