https://oktelugu.com/

Adipurush Collections: ‘ఆది పురుష్’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరం లో ఉందంటే!

ఇప్పుడు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపుగా అసాధ్యమే. ఈ వీకెండ్ మీదనే బయ్యర్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఈ వీకెండ్ బాగా ఆడినా కూడా భారీ నష్టాలు తవ్వని చెప్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 250 కోట్ల రూపాయలకు జరిగింది. అందులో కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 120 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది , ఇదంతా ఇప్పుడు రికవర్ అవ్వడం కష్టం.

Written By:
  • Vicky
  • , Updated On : June 21, 2023 2:42 pm
    Adipurush Collections

    Adipurush Collections

    Follow us on

    Adipurush Collections: ‘ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈమధ్యనే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తొలినుండి ఈ సినిమాపై అభిమానుల్లో మరియు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి, అందువల్ల ఈ సినిమాకి మొదటి మూడు రోజులు అద్భుతమైన వసూళ్లు వచ్చాయి కానీ, ఆ తర్వాత నుండి వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

    ఇప్పుడు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపుగా అసాధ్యమే. ఈ వీకెండ్ మీదనే బయ్యర్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఈ వీకెండ్ బాగా ఆడినా కూడా భారీ నష్టాలు తవ్వని చెప్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 250 కోట్ల రూపాయలకు జరిగింది. అందులో కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 120 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది , ఇదంతా ఇప్పుడు రికవర్ అవ్వడం కష్టం.

    ఒక్కసారి ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, ఈ ప్రాంతం లో ఈ చిత్రాన్ని 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. ప్రస్తుతం ఈ సినిమాకి వస్తున్న వసూళ్ల ట్రెండ్ చూస్తూ ఉంటే ఫుల్ రన్ లో 38 నుండి 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందట.

    ఇక ఆ తర్వాత సీడెడ్ లో 8 కోట్ల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 9 కోట్ల 30 లక్షల రూపాయిలు, ఈస్ట్ లో 5.20 కోట్ల రూపాయిలు, వెస్ట్ నుండి 3.79 కోట్లు, గుంటూరు భూమి ఆరు కోట్ల రూపాయిలు , నెల్లూరు లో రెండు కోట్ల రూపాయిలు మరియు కృష్ణ లో నాలుగుకోట్ల రూపాయిలు వచ్చాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు కలిపి 70 కోట్ల రూపాయలకు పైగా షేర్, అనీ ప్రాంతీయ భాషలకు కలిపి 157 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది ఈ చిత్రం. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 90 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టాలి, అది అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.