https://oktelugu.com/

Adipurush collections : ‘ఆదిపురుష్’ 2 రోజుల వసూళ్లు..తెలుగులో యావరేజ్.. కానీ హిందీలో బాక్స్ ఆఫీస్ సునామీ!

టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మిరాకల్స్ చెయ్యడం తనకి మాత్రమే సాధ్యమని మరోసారి ఆదిపురుష్ చిత్రం ద్వారా రుజువు అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగులో ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు అనే విషయం వాస్తవమే.

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2023 / 09:13 PM IST
    Follow us on

    Adipurush collections : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే ఉన్నప్పటికీ , సెకండ్ హాఫ్ లో మాత్రం జీరో ఎమోషన్స్ ఉండడం తో ఈ చిత్రానికి ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. సినిమాకి డివైడ్ టాక్ అయితే వచ్చింది కానీ, కలెక్షన్స్ పరంగా ఈ సినిమా మరోసారి ప్రభాస్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో ట్రేడ్ కి చూపించింది.

    టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మిరాకల్స్ చెయ్యడం తనకి మాత్రమే సాధ్యమని మరోసారి ఆదిపురుష్ చిత్రం ద్వారా రుజువు అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగులో ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు అనే విషయం వాస్తవమే. కేవలం 32 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది.

    కానీ హిందీ లో మాత్రం ఈ సినిమాకి అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి. మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా 37 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. బాహుబలి 2 చిత్రానికి మొదటి రోజు ఇక్కడ 42 కోట్ల రూపాయిలు వచ్చాయి. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాకి , మరియు డివైడ్ టాక్ వచ్చిన సినిమాకి తేడాని మీరే గమనించండి. దీనిని బట్టి ప్రభాస్ స్టార్ దమ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ రోజు కూడా ఈ సినిమా హిందీ లో సునామి లాంటి వసూళ్లను రాబట్టింది.

    ఈ చిత్రానికి ఇక్కడ రెండవ రోజు ఏకంగా 42 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో మాత్రం ఈ సినిమాకి రెండవ రోజు 21 కోట్ల రూపాయిల గ్రాస్ వస్తుందని అంటున్నారు. మొత్తం మీద రెండవ రోజు అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి ఈ 67 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందట, చూడాలి మరి ‘ఆదిపురుష్’ రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది.