Adhire Abhi Chiranjeeva: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలను తొక్కుతూ ముందుకు సాగుతున్న క్రమంలో చాలామంది స్టార్ డైరెక్టర్లు గొప్ప కథలతో సినిమాలను చేస్తుంటే కొంతమంది కొత్త దర్శకులు మాత్రం నాసిరకపు కథలను ఎంచుకొని బొక్క బోర్లా పడుతున్నారు.. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటిని సంపాదించుకున్న వేణు దర్శకుడిగా మారి ‘బలగం’ సినిమా తీశాడు. ఈ మూవీ తో గొప్ప విజయాన్ని సాధించాడు. దాంతో అతను ఫుల్ టైం దర్శకుడిగా మారిపోయి ప్రస్తుతం ఎల్లమ్మ అనే ప్రాజెక్టుని చేస్తున్నాడు. ఇక అతని బాటలోనే జబర్దస్త్ నుంచి వచ్చిన కొంతమంది మాకేం తక్కువ మేము కూడా డైరెక్షన్ చేసి మా సత్తాను చాటగలమని అనుకొని సినిమాలను చేశారు. కానీ వాటితో ఏమాత్రం సక్సెస్ ని సాధించలేకపోయారు. మొదట ధనరాజ్ ‘రామం రాఘవం’ అనే సినిమా చేశాడు. అది ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక ఇప్పుడు అదిరే అభి సైతం చిరంజీవ అంటూ ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించడం విశేషం…ఇక ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది…
నిజానికి సినిమా చేయడం అంటే జబర్దస్త్ లో స్కిట్ రాసినంత ఈజీ కాదు అనే విషయాన్ని వీళ్ళందరూ గమనిస్తే మంచిది. వేణు ఎలాగైతే ఒక ఇంటెన్స్ రైటింగ్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడో అలాంటి ఒక కథ దొరికినప్పుడు దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే సినిమాలు సక్సెస్ అవుతాయి. అంతేతప్ప జబర్దస్త్ లో రాసినట్టుగా ఒక నాలుగు బూతు డైలాగులు రాసినంత మాత్రాన ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం అసాధ్యం…
10 నిమిషాల స్కిట్ కి రెండు గంటల సినిమాకి చాలా తేడా ఉంది… ‘అధిరే అభి’ ఈ సినిమాతో అసలు ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. అవుడేటెడ్ కథతో ఎంటర్టైన్ చేయాలనుకోవడం మూర్ఖత్వం అవుతోంది. రొటీన్ కథకి ఫాంటసీని జోడించినప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి.
ఏదో ఇరికించినట్టు సీన్స్ రాసుకొని కామెడీ సీన్లతో నడిపించొచ్చు కదా అంటే వర్కౌట్ అవ్వదు… ఇక ఈ సినిమాలో హీరోకి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎదుటివారు ఎప్పుడు చనిపోతున్నారు వాళ్ళ ఆయుష్షు ఎంత అనేది వాళ్ళ నుదుటిపైన హీరోకి కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల అతను దాన్ని తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటాడు.
స్వతహాగా అంబులెన్స్ డ్రైవర్ అయిన హీరో స్వప్రయోజనాల కోసం తన శక్తిని వాడుకొని ఆ తర్వాత ఎలా రియలైజే అయ్యాడు. ఎలా తనను తాను ఒక మనిషిగా తీర్చిదిద్దుకున్నాడు అనేదే ఈ సినిమా కథ మొత్తానికైతే ఈ సినిమాలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. ఇంకా దానికి మించి స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ కూడా చాలా దారుణంగా ఉంది. ఇక ఆహా వాళ్ళు తీసుకున్నారంటేనే ఆ సినిమా స్టాండెడ్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…