Homeఎంటర్టైన్మెంట్Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం' సినిమాలో వైలెన్స్ ఎక్కువ అవుతుందా..?

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో వైలెన్స్ ఎక్కువ అవుతుందా..?

Adarsha Kutumbam: త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని చాలామంది అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఫ్యామిలీతో పాటు యాక్షన్ ఓరియెంటెడ్ సన్నివేశాలకు కూడా చాలా వరకు ప్రాముఖ్యత ఉందట. ఇక ఈ సినిమాలో వైలెన్స్ సైతం విపరీతంగా ఉండబోతుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాతో త్రివిక్రమ్ మరోసారి టాప్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా […]

Adarsha Kutumbam: త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని చాలామంది అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఫ్యామిలీతో పాటు యాక్షన్ ఓరియెంటెడ్ సన్నివేశాలకు కూడా చాలా వరకు ప్రాముఖ్యత ఉందట. ఇక ఈ సినిమాలో వైలెన్స్ సైతం విపరీతంగా ఉండబోతుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాతో త్రివిక్రమ్ మరోసారి టాప్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో మార్కెట్ భారీగా పడిపోయింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవ్వాలంటే మాత్రం ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉందని ఆయన భావిస్తున్నారట.

ఇక ఇది ఏమైనా కూడా ఈ సినిమాలో వెంకటేష్ తో కత్తి పట్టించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి కామెడీ చేయిస్తూనే వెంకటేష్ చేత భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

గత సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు ఈ సినిమాలో అంతకుమించిన కలెక్షన్స్ రాబట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద సరైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాని చూడడానికి అటు వెంకటేష్ అభిమానులు ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక త్రివిక్రమ్ సైతం ఈ సినిమాని వీలైనంత తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు… ఇక ఇంతకుముందు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ను చూపించడానికి ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. ఈ సినిమాలో సైతం అలాంటివే చూపించడానికి ప్రయత్నిస్తున్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper