https://oktelugu.com/

Actress Taapsee: అందంగా కనపడేందుకు అదే నా సీక్రెట్ అంటున్న తాప్సీ…

Actress Taapsee: “ఝుమ్మంది నాదం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సొట్ట బుగ్గల అమ్మడు తాప్సీ. దరువు, మిస్టర్ పర్ఫెక్ట్, గుండెల్లో గోదారి, వీర, మొగుడు, వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. కోలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించిన అవి  అంత గుర్తింపును తీసుకురాలేదని చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు తాప్సీ. పింక్‌, తప్పడ్‌, హసీనా దిల్‌రుబా  వంటి విభిన్న చిత్రాలతో నటించి విజయ బాటలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 29, 2021 / 08:10 PM IST
    Follow us on

    Actress Taapsee: “ఝుమ్మంది నాదం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సొట్ట బుగ్గల అమ్మడు తాప్సీ. దరువు, మిస్టర్ పర్ఫెక్ట్, గుండెల్లో గోదారి, వీర, మొగుడు, వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. కోలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించిన అవి  అంత గుర్తింపును తీసుకురాలేదని చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు తాప్సీ. పింక్‌, తప్పడ్‌, హసీనా దిల్‌రుబా  వంటి విభిన్న చిత్రాలతో నటించి విజయ బాటలో దూసుకుపోతున్నారు ఈ అమ్మడు. ప్రస్తుతం తాప్సీ మాజీ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అందంపై పలు ఆసక్తికర విషయాలు చెప్పింది తాప్సీ .

    actress tapsee revealed interesting details about her glamour

    Also Read: ‘పరుగు’ హీరోయిన్ ఇప్పుడే పరిస్థితుల్లో ఉందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

    Actress Taapsee

    నా కళ్లు పెద్దగా, నా ముక్కు సన్నగా… ఆఖరికీ జుట్టు కూడా రింగు రింగులుగా కనిపిస్తుండేది. హీరోయిన్స్ చాలామందికి సైతం నాలాంటి జుట్టు ఉండదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక… సెలూన్‌కి వెళ్లి కెమికల్స్‌తో హెయిర్‌ని అందంగా చేసుకునేదాన్ని. అలా ఒకటి, రెండు సార్లు చేయించుకున్నా ఆ తర్వాత నుండి నాకు జట్టు రాలడం ప్రారంభమైంది. దాంతో మళ్లీ వాటి జోలికి పోలేదు. అయితే నిజానికి. అందానికి పరిమితులుగా చెప్పుకొనే కొన్నింటికీ నేను సరిపోను. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను నేను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోయాను. మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్య ప్రపంచానికి ఎంతో అందంగా కనిపిస్తామని అర్థమైంది. అప్పటి నుంచి అందంపై నా అభిప్రాయం మారింది. నటనపై మనం ఎంత మక్కువ చూపుతామో అలానే నటిస్తున్న ఆ పాత్రకి ప్రాణం పోస్తే అప్పుడు అభిమానులకు ఎంతో అందంగా కనిపిస్తాము. అదే నా సీక్రెట్ అని చెప్పుకొచ్చారు హీరోయిన్ తాప్సీ.

    Also Read: లోదుస్తులతో అరాచకం.. అవకాశాల కోసమేనా ఈ బరి తెగింపు !