https://oktelugu.com/

Actress Tamannah: అయోమయంలో మిల్కీ బ్యూటీ తమన్నా…

Actress Tamannah: సాధారణంగా ఒక సినిమా పట్టలెక్కబోతుందంటే ఆ మూవీలో నటించే వారికి అడ్వాన్స్ ఇచ్చి… అగ్రిమెంట్ కుదుర్చుకుని డేట్స్ ఫైనలైజ్ చేసుకుంటారు. లేదంటే వారి బదులు వేరే వారిని తీసుకోవలనే ఆలోచన ఉంటే పేమెంట్ ఇవ్వకుండా … వెయిటింగ్ లో ఉంచుతారు. ఇప్పుడు మన మిల్కీ బ్యూటీ తమన్నా కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఎందుకంటే ఆమెను చిరంజీవి సినిమాలో హీరోయిన్ అడిగినా… ఇంకా అడ్వాన్స్ పంపలేదని సమాచారం. దీంతో ఆమె వేరే ప్రాజెక్టుకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 22, 2021 / 12:08 PM IST
    Follow us on

    Actress Tamannah: సాధారణంగా ఒక సినిమా పట్టలెక్కబోతుందంటే ఆ మూవీలో నటించే వారికి అడ్వాన్స్ ఇచ్చి… అగ్రిమెంట్ కుదుర్చుకుని డేట్స్ ఫైనలైజ్ చేసుకుంటారు. లేదంటే వారి బదులు వేరే వారిని తీసుకోవలనే ఆలోచన ఉంటే పేమెంట్ ఇవ్వకుండా … వెయిటింగ్ లో ఉంచుతారు. ఇప్పుడు మన మిల్కీ బ్యూటీ తమన్నా కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఎందుకంటే ఆమెను చిరంజీవి సినిమాలో హీరోయిన్ అడిగినా… ఇంకా అడ్వాన్స్ పంపలేదని సమాచారం. దీంతో ఆమె వేరే ప్రాజెక్టుకు సైన్ చేయాలా, వొద్దా అనే అయోమయంలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ దూసుకపోతున్నారు. ఇప్ప‌టికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య ” త్వరలో విడుదలకు సిద్దం కానుంది. మరోవైపు మలయాళీ చిత్రం లూసిఫర్ రీమేక్… గాడ్ ఫాదర్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో… భోళా శంకర్ అనే సినిమా కూడా చేస్తున్నారు. తమిళంలో అజిత్ నటించిన వెడలం కు రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో కీర్తి సురేష్… చిరంజీవి చెల్లి పాత్రలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా సెల‌క్ఠ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

    అయితే చిరు సినిమా కోస తమన్నాను హీరోయిన్ గా అడిగినా… ఇంకా అడ్వాన్స్ పంపలేదని సమాచారం. ఈ క్ర‌మంలో ఆమెకు బాలీవుడ్ సినిమా అవ‌కాశం వచ్చిన ధానికి ఒకే చెప్పాలా, వొద్దా అనే సందేహం లో ఉన్నట్లు తెలుస్తుంది. భోళా శంకర్ సినిమా షూటింగ్ వాయిదా పడిన‌ట్టు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. గాడ్ ఫాద‌ర్ సినిమా షూట్ పూర్తయ్యాక… వచ్చే ఏడాది సమ్మర్ లో భోళా శంకర్ ను ప్రారంభించ‌నున్న‌ట్టు నిర్మాతలు భావిస్తున్నారంట. అందుకే తమన్నాకు ఇంకా అడ్వాన్స్ ఇవ్వ‌లేద‌ని అనుకుంటున్నారు.