Sai Dharam Tej- Swathi: వెండితెరపై స్టార్ అయిన వాళ్లలో చాలా మంది బుల్లితెర నుంచి వచ్చిన వాళ్లే. ఒకప్పుడు యాంకర్ అంటే చాలా మంది న్యూస్ చదివేవాళ్లు మాత్రమే అనుకునేవాళ్లు. కానీ మా టీవీలో ‘కలర్స్’ అనే ప్రోగ్రాంతో యూత్ కూడా టీవీలు చూడడం ప్రారంభించారు. ముద్దు ముద్దు మాటలతో సరదా కబుర్లోతో యాంకర్లు ఇంప్రెస్ చేస్తారని అప్పటి నుంచి ప్రారంభమైంది. ఈ ప్రోగ్రామ్ లో యాంకర్ గా నటించి అలరించింది స్వాతి. బుల్లితెరపై ఈ షో సక్సెస్ కావడంతో అప్పటి నుంచి ఆమెను కలర్స్ స్వాతి అని పిలుస్తున్నారు. ఈ షో తరువాత స్వాతి నేరుగా వెండితెరపై కనిపించారు. హీరోయిన్ గా ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఆమె ఓ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ కు అందరిముందే ముద్దుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమె అలా ముద్దు పెట్టడానికి కారణమేంటో తెలుసా?
కలర్స్ స్వాతి 1987 ఏప్రిల్ 19న రష్యాలో జన్మించింది. తండ్రి ఉద్యోగ రీత్యా రష్యాలో ఉండగా ఈమె అక్కడే పెట్టింది. దీంతో ఈమెకు స్వెత్లానా అని పేరు పెట్టారు. ఆ తరువాత వీరి కుటుంబం విశాఖపట్నంకు మారడంతో అక్కడ్ స్వాతి అని మార్చారు. విద్యార్థి దశలో చదువుతో పాటు ఆట,పాటల్లో స్వాతి చురుగ్గా ఉండేవారు. ప్రాథమిక విద్య మొత్తం విశాఖలో పూర్తి చేసి ఇంటర్మీడియట్ ను హైదరాబాద్ లో చేసింది. ఆ తరువాత ఫోరెన్సిక్ లో పీజీ చేసింది.
16 ఏళ్ల వయసులో ఉండగానే స్వాతి ‘కలర్స్’ అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులు పరిచయం అయ్యారు. ఆ తరువాత వెంకటేష్ హీరోగా వచ్చిన ‘ఆడువారి మాటలకు అర్థాలు వేరులే’ అనే సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈమె నటనకు మెచ్చిన కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘డేంజర్’ అనే సినిమాలో సైడ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ‘అష్టాచమ్మా’ అనే సినిమాలో రెండో హీరోయిన్ నటించి ఆకట్టుకుంది. దీంతో స్వాతికి అవకాశాలు పెరిగాయి. హీరో నిఖిల్ తో కలిసి ‘స్వామి రారా’ అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించారు.
అప్పటి నుంచి పలు సినిమాల్లో నటించింది స్వాతి. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ నటించి మెప్పించింది. ఆ తరువాత కొన్నాళ్లకు వికాస్ వాసు అనే వ్యక్తిని 2018 ఆగస్టు 30న పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తరువాత స్వాతి మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అయితే ఇటీవల స్వాతి విడాకులపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె భర్తతో విడిపోతుందంటూ కొందరు ప్రచారం చేయడంపై ఆమె రియాక్టయ్యారు. తాను విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్న స్వాతి తాజాగా ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రమోష్ కార్యక్రమంలో స్వాతి పాల్గొన్నారు. ఈ ప్రొగ్రామ్ కు సాయి ధరమ్ తేజ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా స్వాతి ఒక్కసారిగా సాయిధరమ్ తేజ్ కు ముద్దుపెట్టారు. దీంతో అంతా షాక్ అయ్యారు. అయితే వీరిద్దరు కాలజీ రోజుల్లో మంచి స్నేహితులని తరువాత తెలిసింది. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ స్వాతిని స్వాతిగాడు అని పిలిచేవారట. ఈ చనువుతోనే సాయి ధరమ్ తేజ్ ను స్వాతి ముద్దుపెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు భర్తతో విడాకులు అని ప్రచారం అవుతున్న తరుణంలో స్వాతి ఇలా చేయడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.