Actress Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే అద్భుతమైన నటనతో చిన్నతనం నుండే సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. నటి శ్రీదేవి లేకపోయినా తన కూతురు జాన్వీ కపూర్ శ్రీదేవి లోటును భర్తీ చేసింది అనే చెప్పాలి. అయితే శ్రీదేవి కుటుంబం నుంచి మరో తార వినోద ప్రపంచంలోకి రానున్నారు.ఆ తార శ్రీదేవి రెండో కూమార్తె ఖుషి కపూర్ అనుకుంటే పొరపాటే. శ్రీదేవి మేన కోడలు శిరీష ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో అలరిస్తున్నారు. శిరీష కి జంటగా మరో సీనియర్ నటుడు మనవడు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శిరీష కనువిందు చేస్తున్నారు.కేరళ నేపథ్యంలో అక్కడి సాంప్రదాయంలో ఓ లవ్‌ట్రాక్‌పై ఈ మ్యూజిక్ వీడియో సాగింది. ప్రస్తుతం ఈ మ్యూజిక్ వీడియో సాంగ్ నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

ఈ పాట లో కొన్ని జనరేషన్‌లుగా లవ్ చేసుకుంటున్న జంటల ప్రేమ ఇతివృతంలో శిరీష, దర్శన్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.ఈ మ్యూజిక్ వీడియోను సీనియర్ నటి పద్మిని మనవరాలు లక్ష్మి దేవి రూపొందించింది. “యదలో మౌనం” అంటూ సాగే ఈ మ్యూజిక్ వీడియోకు అచ్చు రాజమణి, వరుణ్ మీనన్ సంగీతం సమకూర్చారు. టాలీవుడ్ యువ గీత రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాటతో ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమా ఆఫర్ ను అందుకుంటుందో లేదో వేచి చూడాలి మరి.