Homeఎంటర్టైన్మెంట్Shakila: ఎందరినో ప్రేమించాను, 23 ఏళ్లకే అన్నీ చూశాను... షకీలా షాకింగ్ కామెంట్స్

Shakila: ఎందరినో ప్రేమించాను, 23 ఏళ్లకే అన్నీ చూశాను… షకీలా షాకింగ్ కామెంట్స్

Shakila: షకీలా అనగానే అలాంటి కంటెంట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. 90లలో ఆమె మలయాళ చిత్ర పరిశ్రమను ఏలారు. షకీలా చిత్రాలు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోకి కూడా డబ్ అయ్యేవి. దాంతో ఆమెకు సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీ ఉండేది. శృంగార తారగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఆమె సొంతం చేసుకుంది. స్టార్డమ్ తగ్గాక షకీలా కమెడియన్ గా మారింది. తొట్టి గ్యాంగ్, జయం, నిజం, దొంగోడు వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. షకీలా లేడీ కమెడియన్ గా కూడా సక్సెస్ అని చెప్పాలి. నటిగా హైట్స్ చూసిన షకీలా వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆమె వివాహం చేసుకోలేదు.

తాజా ఇంటర్వ్యూలో షకీలా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. షకీలా మాట్లాడుతూ… నేను కుటుంబం కోసం అడల్ట్ మూవీస్ చేశాను. కానీ ఆ కుటుంబం ఇప్పుడు నాతో లేదు. డబ్బు ఉంటేనే ఎవరైనా మనతో ఉంటారు. లేదంటూ ఎవరూ ఉండరు. నేను 23 ఏళ్లకే అన్నీ చూశాను. స్టార్డం అనుభవించాను. నా సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు కూడా తమ చిత్రాలు వాయిదా వేసుకునేవారు. ప్రతి శుక్రవారం నా సినిమా ఒకటి విడుదలయ్యేది. తక్కువ ఖర్చుతో నాతో చిత్రాలు చేసేవారు.

నేను ఐదు కార్లు కొన్నాను. ఇళ్ళు కొన్నాను. నేను చాలా మందిని ప్రేమించాను. అందరూ నన్ను మోసం చేసి వెళ్లిపోయారు. ప్రేమించినవారందరూ ఒకటే అడిగేవారు. మీ అమ్మ నీతో ఉండకూడదు అనేవారు. అమ్మ కోసం నేను వాళ్ళను వదిలేశాను. ఇప్పుడు అమ్మ నాతో లేదు. అన్న మరణంతో అతని పిల్లల బాధ్యత నా మీద పడింది. వాళ్ళను కూడా నేనే చూసుకున్నాను.

నాకు ప్రస్తుతానికి తిండి, బట్టకు ఏ లోటు లేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నాను. జీవితం అంటే కేవలం పెళ్లి, పిల్లలే కాదు. నేను ట్రాన్స్జెండర్స్ ని దత్త తీసుకున్నాను. వాళ్లకు పెళ్లిళ్లు చేస్తున్నాను. అలా పెళ్లి కాకుండానే తల్లిని అయ్యాను. నాకు ఒక కుటుంబం ఉండాలి. అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. నాకు యాంకరింగ్ అంటే ఇష్టం. అందుకే ఓ ఛానల్ లో యాంకర్ గా చేస్తున్నాను. తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయాలని ఉంది… అన్నారు.

Exit mobile version