Samantha: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన వారిలో సమంత ఒకరు. ఈ భామ తెలుగు తమిళ పరిశ్రమలోనే ఎక్కువగా చిత్రాలు చేస్తూ ఉండేవారు. బాలీవుడ్ పై అంత మక్కువ చూపించేవారు కాదు. ప్రస్తుతం ఈ భామ దృష్టి బాలీవుడ్ పై ఉందనే చెప్పాలి. ది ఫ్యామిలీ మాన్ 2 తర్వాత బాలీవుడ్ లో సమంత క్రేజ్ మరింత పెరిగింది అని చెప్పవచ్చు.ఈ సిరీస్ తర్వాత సమంతాకి బాలీవుడ్ ఆఫర్లు వచ్చిన వాటిని తిరస్కరించారు అని వార్తలు కూడా వచ్చాయి.ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కొన్ని స్క్రిప్ట్ వింటుందని కొత్త ప్రాజెక్ట్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది
సామ్ చైతు విడాకుల అనంతరం ఈ భామ బాలీవుడ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకోసం ముంబైలో తన పబ్లిసిటీ కోసం పీఆర్ ఏజెన్సీను నియమించుకున్నారంట సామ్.ఇప్పటికే మన స్టార్ హీరోలు హీరోయిన్ లు సైతం ముంబైలో పీఆర్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకునే పనిలో పడింది సామ్.ఈ భామ నేషనల్ మీడియా లో కార్పొరేట్ బ్రాండ్స్ పబ్లిసిటీ పనులు బాగానే జరుగుతున్నాయట. ఈ అమ్మడు బాలీవుడ్ లో ఒక కథ ఓకే చేశారని ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయింది. చూడాలి మరి సౌత్ సినిమాల్లో స్టార్ నటిగా గుర్తింపు పొందిన ఈ భామ బాలీవుడ్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.