https://oktelugu.com/

Actress Samantha: అలా ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉన్నానంటున్న సామ్… ఏంటంటే ?

Actress Samantha: సమంత కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. సమంత నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాత తమిళ్ లోనూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 6, 2022 / 09:45 AM IST
    Follow us on

    Actress Samantha: సమంత కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. సమంత నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాత తమిళ్ లోనూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని చూస్తుంది ఈ అమ్మడు. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది సమంత. ఈ వెబ్ సిరీస్ హిట్ అవ్వడంతో మరికొన్ని ఆఫర్స్ వస్తున్నాయి ఈ ముద్దుగుమ్మకు. ఇటీవలే హాలీవుడ్ మూవీ కి ఒకే చెప్పినట్లు అధికారికంగా ప్రకటించింది.

    కాగా అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది సమంత. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట 2021 లో విడాకులు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ఇక విడాకుల అనంతరం సామ్ తన కెరీర్ పై దృష్టి సారించింది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదుర్స్ అనిపించుకుంది సామ్. ఓ వైపు సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తూ… సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటోంది సామ్. గత కొన్ని రోజులుగా మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తుంటుంది. సద్గురు మాట్లాడిన మోటివేషన్ కోట్స్ వీడియోస్ షేర్ చేస్తుంది సామ్.

    తాజాగా సమంత తన ఇన్ స్టా ఖాతాలో మరో పోస్ట్ చేసింది. “ఓకే యూనివర్స్.. ఇక మంచిని తీసుకునేందుకు .. ఫీల్ అయ్యేందుకు నేను రెడీగా ఉన్నాను. నేను మంచిగా ఫీల్ అయ్యేలా చేయ్ ” అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక సామ్ చేసిన పోస్ట్ చూస్తుంటే.. ఈ ఏడాది తనకంతా మంచి జరగాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.