Samantha: ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన సమంత… తనదైన నటనతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. 2017 లో చైతన్యను వివాహం చేసుకుని… ఇటీవల వారి వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ తాము విడిపోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విడాకుల తర్వాత కూడా ఫుల్ బిజీగా ఉంటుంది సమంత. ప్రస్తుతం సామ్ ఫోకస్ మొత్తం తన కెరీర్‌పైనే పెట్టినట్లు కనపిస్తోంది. ఈ క్రమం లోనే వరుసగా సినిమాలకు ఓకే చెప్తూ… విభిన్న పాత్రలను ఎంచుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం సమంత చేస్తోన్న పనులను ఎవ్వరూ అంచనా వేయలేకపోతోన్నారు. అసలు నాగ చైతన్య నుంచి ఎందుకు విడిపోయింది.. విడాకులు ఎందుకు తీసుకుంది… జరిగిన గొడవలు ఏంటి అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.

పదేళ్ల స్నేహం, ప్రేమ ఇలా అన్నీ కూడా మాయమైపోయాయి. చివరకు కుక్క బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసిన సామ్ మాజీ భర్త చైతూకి కనీసం విషెస్ చెప్పలేదు. అయితే సమంత మాత్రం ఇప్పుడు పూర్తిగా తన కెరీర్ మీదే దృష్టి పెట్టేసింది. ఉత్తరాదిన పాగా వేయాలని ప్లాన్ వేసినట్టుంది. అందుకే దానికి తగ్గట్టుగా అందాలను గట్టిగానే ఆరబోస్తోంది. ఇప్పుడు సమంత ఏకంగా హాలీవుడ్ లో అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో బై సెక్సువల్ అమ్మాయిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా సమంత తన అందాలను భారీగా ఆరబోసింది. వరుస ఫోటో షూట్లతో హంగామా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎల్లె ఇండియా అనే మ్యాగజిన్ కోసం సమంత చేసిన ఈ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది. ఈ ఫోటోషూట్ లో అమ్మడి ఫోటోలకి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
#ELLEDigitalCoverStar: Go behind the scenes with our digital cover star @Samanthaprabhu2 on the sets of our November cover shoot. pic.twitter.com/1ztUfCq04k
— ELLE India (@ELLEINDIA) November 30, 2021