https://oktelugu.com/

Sai pallavi: అలాంటి సినిమాలో చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టిన సాయి పల్లవి…

Sai pallavi: ‘ప్రేమమ్’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది సాయి పల్లవి. ఆ తర్వాత వచ్చిన  ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసిందనే చెప్పాలి. ఆ మూవీ లో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆ తర్వాత తెలుగులో  వరుస అవకాశాలు దక్కించుకొని ఫుల్ ఫామ్ లో కొనసాగుతుంది. మధ్యలో వచ్చిన ‘ఎం.సి.ఎ’, ‘పడి పడి లేచే మనసు’ సినిమాలు సక్సెస్ సాధించకపోయినప్పటికి… ఆమె నటనకు మాత్రం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 2, 2021 / 12:47 PM IST
    Follow us on

    Sai pallavi: ‘ప్రేమమ్’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది సాయి పల్లవి. ఆ తర్వాత వచ్చిన  ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసిందనే చెప్పాలి. ఆ మూవీ లో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆ తర్వాత తెలుగులో  వరుస అవకాశాలు దక్కించుకొని ఫుల్ ఫామ్ లో కొనసాగుతుంది. మధ్యలో వచ్చిన ‘ఎం.సి.ఎ’, ‘పడి పడి లేచే మనసు’ సినిమాలు సక్సెస్ సాధించకపోయినప్పటికి… ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల ‘లవ్ స్టోరి’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ భామ. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి…మంచి కలెక్షన్లను సాధిస్తుంది.  సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది సాయి పల్లవి.

    ఈ మేరకు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు సాయి పల్లవి. ఈ సంధర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఓ ఫన్ స్క్రిప్ట్ లో నటించాలని ఉందని… సరైన కామెడీ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని వెల్లడించింది.  ప్రస్తుతం అటువంటి సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ఎవరైనా కామెడీ కథతో సాయి పల్లవి దగ్గరకు వెళితే… కథతో మెప్పిస్తే… ఆమె సినిమా ఓకే చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమె గత సినిమాలు గమనిస్తే ఎక్కువగా ఎమోషనల్ క్యారెక్టర్లు చేశారు. రాబోయే ‘విరాట పర్వం’లో కూడా ఎమోషనల్ రోల్ లో కనిపించనున్నారు. అందుకని, కామెడీ సినిమా చేయాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టినట్లు తెలుస్తుంది. అలానే ఇటీవల చూసిన సినిమాల్లో హాలీవుడ్ ఫిల్మ్ ‘డ్యూన్’, బాలీవుడ్ ఫిల్మ్ ‘సర్దార్ ఉద్ధమ్’ నచ్చాయని సాయి పల్లవి తెలిపారు.