https://oktelugu.com/

Ritika Nayak: శ్రీలీలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న హాట్ బ్యూటీ..ఇలా అయితే ఇక కష్టమే..అసలు ఏమైందంటే!

పూర్తి వివరాల్లోకి వెళ్తే విశ్వక్ సేన్ హీరో గా నటించిన 'ఆకాశ వనంలో అర్జున కళ్యాణం' చిత్రం లో హీరోయిన్ గా నటించిన రితిక నాయక్, అతి త్వరలోనే శ్రీలీల, మీనాక్షి చౌదరి అవకాశాలకు గండి కొట్టేట్టు ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

Written By:
  • Vicky
  • , Updated On : January 8, 2025 / 05:23 PM IST

    Ritika Nayak

    Follow us on

    Ritika Nayak: సినీ ఇండస్ట్రీ లో ఈమధ్య కొత్తగా ఇండస్ట్రీ లోకి వస్తున్న హీరోయిన్లు కేవలం ఒకటి, రెండు సినిమాలకే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోతున్నారు. అప్పటి వరకు మంచి ఊపు మీదున్న టాప్ సెలబ్రిటీస్ ని క్రిందకు నెట్టి, కొత్తగా వచ్చే అమ్మాయిలు ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నారు. అలా వచ్చిన వారిలో ఒకరు శ్రీలీల. కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా ఈమె మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. తొలిసినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయిన శ్రీలీల, అంతటి కాలం లో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది. ఈమె తర్వాత రీసెంట్ గానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరీ కూడా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. అయితే వీళ్ళిద్దరిని తలదన్నే మరో హీరోయిన్ ఇండస్ట్రీ లో అతి త్వరలోనే పాగా వెయ్యనుందా అంటే అవుననే చెప్పాలి.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘ఆకాశ వనంలో అర్జున కళ్యాణం’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన రితిక నాయక్, అతి త్వరలోనే శ్రీలీల, మీనాక్షి చౌదరి అవకాశాలకు గండి కొట్టేట్టు ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ప్రస్తుతం ఈ అమ్మాయి దూకుడు చూస్తుంటే అదే నిజమై అనిపిస్తుంది. చూసేందుకు చాలా అందం గా ఉంటుంది, మొదటి సినిమా నటన కూడా అదరగొట్టేసింది. శ్రీలీల డ్యాన్స్ అద్భుతంగా వేస్తుంది కానీ, ఆమె నటన మీద ఆడియన్స్ నుండి బోలెడన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ ఒక్క క్వాలిటీ రితిక నాయక్ కి అదనంగా ఉండడం తో భవిష్యత్తులో ఈమె ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి.

    అందులో ఒకటి ఆనంద్ దేవరకొండ తో నటిస్తున్న ‘డ్యూయెట్ ‘ కాగా, మరో చిత్రం తేజ సజ్జ నటిస్తున్న క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం ‘మిరాయ్’. వీటితో పాటు వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్రం లో కూడా ఈమె హీరోయిన్ నటించే అవకాశం ని సంపాదించుకుంది. వీటితో పాటు ఒక మీడియం రేంజ్ హీరో సినిమాలో కూడా ఈమె నటించేందుకు రీసెంట్ గానే సంతకం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ చిత్రం గురించి పూర్తి వివరాలు బయటకి రావాల్సి ఉంది. చేతికి దొరికిన ప్రతీ సినిమాని చేస్తూ పోతే కృతి శెట్టి లాగా తళుక్కుమని మెరిసి మాయం అయిపోగలరు. కాబట్టి స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో ఎలాంటి పొరపాటు చేయకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకొని చేయాలి. అలా చేయడం వల్లే సాయి పల్లవి లాంటోళ్ళు ఈరోజు ఇండస్ట్రీ లో ఈ స్థాయిలో ఉన్నారు.