![]()
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ సినిమా అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. మాస్ మసలాతో కూడిన యాక్షన్ తో పాటు డైలాగ్ డెలివరీలో బాలయ్యది ప్రత్యేక శైలి. ఆయన సినిమాలో స్టోరీ ఎలా ఉన్న డైలాగ్లు మాత్రం ఆకట్టుకునేలా ఉంటాయి. తాతయ్యగా మారిన బాలయ్య కుర్రహీరోలకు పోటీనిస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. ఇక ఆయన సినిమాల్లోనూ యంగ్ హీరోయిన్లను తెచ్చిపెడుతూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అయితే తాజాగా బాలయ్య సినిమాకోసం హీరోయిన్ దొరకడం పెద్ద కష్టంగా మారిందట. ఆయనతో సినిమా చేయడానికి ఓ హీరోయిన్ నో చెప్పిందట..
బాలయ్య సినిమా ఎలా ఉన్న కథానాయకలు మాత్రం కొత్తవారిని తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు డైరెక్టర్లు. వయసుతో సంబంధం లేకుండా రొమాన్స్ చేసే విధంగా బాలయ్య సినిమాకు కథను తీర్చిదిద్దుతుంటారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ ను సెట్ చేసేందుకు డైరెక్టర్ రెడీ అవగా కాస్త బెడిసికొట్టిందట. గోపిచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో ముందుగా త్రిష, శృతి హాసన్ లు అనుకున్నారు. అయితే వారిని తీసుకోలేదని తేలింది.
దీంతో ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను సెట్ చేసేందుకు యత్నించారు. బాలీవుడ్ భామలు సౌత్ లో అవకాశాలుంటే ఏమాత్రం తడుముకోకుండా ఓకే చెప్పేస్తారు. అలా సోనాక్షి సిన్హా ఇదివరకే రజనీతో లింగ సినిమాలో కనిపించింది. అయితే మరోవైపు చిరంజీవితో కూడా నటించేందుకు ఓకే చెప్పిందట. అయితే బాలకృష్ణ కోసం వెళ్లి అడగగా ఈ భామ నో చెప్పిందట. దీంతో షాక్ తినడం డైరక్టర్ వంతయింది.
నటసింహం బాలకృష్ణ పక్కన నటించేందుకు సోనాక్షి ఎందుకు ఒప్పుకోలేదనే చర్చ తీవ్రంగా మారింది. దీంతో బాలయ్య కోసం మళ్లీ కథానాయకను వెతికే పనిలో పడ్డారట. అయితే లెటేస్ట్ ట్రెండ్ హీరోయిన్లను సెట్ చేద్దామని అనుకున్నా.. వారు బాలకృష్ణ కు సెట్ కావడం లేదట. ఇలా మిడిల్ ఏజ్ వాళ్లను అడిగితే నో చెబుతున్నారట. మరి చివరికి బాలకృష్ణ ఏ హీరోయిన్ కు ఓకే చెబుతాడో చూడాలి..