
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నుంచి జయంతి వరకు 14 రోజుల పాటు బీజేపీ దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో సోము వీర్రాజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2022 నాటికి దేశంలో సొంత ఇళ్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో మోదీ గారు రాష్ట్రనికి లక్షలాది ఇళ్లను మంజూరు చేసి ఇస్తే జగన్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇళ్లు కట్టలేదని అన్నారు. కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇసుక, సిమెంటు, స్టీలు ధరలు పెంచారని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి మాలతీరాణి, రేలంగి శ్రీదేవి తదితర నాయకులు పాల్గొన్నారు.
https://www.facebook.com/somuveerrajubjp/videos/127624732825423