Rashmika Mandanna: “ఛలో” సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన “గీతా గోవిందం” లో నటించి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ కాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది ఈ కన్నడ భామ. ఆ తర్వాత ఆమె నటించిన డియర్ కామ్రేడ్, దేవ్ దాస్ చిత్రాలు నిరాశ పరిచిన భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిందని చెప్పాలి. ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ చిత్రంలో శ్రీవల్లిగా అదరగొట్టింది రష్మిక. గ్లామర్ బ్యూటీకి మేకప్ లేకపోయినా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. పుష్ప ది రైజ్ చిత్రం విడుదలైన అన్నీ భాషల్లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దీంతో ఈ చిత్ర విజయాన్ని రష్మిక ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. అలానే పుష్ప మూవీ విజయం తన బాలీవుడ్ కలలను మరింత పెంచిందని రష్మిక భావిస్తోంది.
తన రాబోయే హిందీ చిత్రాలు గుడ్‌బై, మిషన్ మజ్ను తన బాలీవుడ్ కెరీర్‌కు మరింత ఊపునిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం తెలుగులో సినిమా ఆఫర్లను కూడా ఆమె తిరస్కరించినట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మిషన్ మజ్ను సినిమాలో సిద్దార్డ్ మల్హోత్రా తో కలిసి నటిస్తుండగా… అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది.