Allu Sireesh: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ “కొత్తజంట” విజయం తర్వాత అతనే ఖాతాలు సూపర్ హిట్ లేదనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన శ్రీరస్తు శుభమస్తు ABCD వంటి సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందలేదు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి అల్లు శిరీష్ కొత్త సినిమాలు చేయలేదు అని చెప్పుకోవాలి. అయితే తాజాగా” ప్రేమ కాదంటా?” చిత్రంలో నటిస్తున్నారు శిరీష్.ఈ చిత్రాన్ని రాకేష్ శశి అని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ద్వారా శిరీష్ మరోసారి ఎమోషన్ అయ్యారు. తెలుగులో నాని నటనకు ఎంతో మంది ప్రశంసలు అందుకున్న చిత్రం “జెర్సీ”. ఈ చిత్రాన్ని హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ఈ ఏడాది డిసెంబర్ 31న విడుదలకు సిద్ధంగా ఉంది. షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్ర హోల్డింగ్ లో అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్ అని రాసి ఉండటాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు శిరీష్. అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్ అని జుహు సర్కిల్‌లో ఓ హోర్డింగ్‌లో చూడాలని పద్నాలుగేళ్లుగా ఎదురుచూశాను. మొత్తానికి జరిగింది అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వచ్చే ఏడాది అయినా శిరీష సినీ కెరీర్ మలుపు తిరుగుతుందో లేదొ చూడాలి మరి.