Actress Raasi In Webseries: తెలుగు తెర పై ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే బ్యూటీ రాశి. ముందు జనరేషన్ కుర్రాళ్ల గుండెలను తన హ్యూజ్ గ్లామర్ తో ఉక్కిరిబిక్కిరి చేయడంలో రాశి మహా నేర్పరి. సీనియర్ బ్యూటీగా ఇప్పటికీ సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అసలు మిడిల్ ఏజ్ లో కూడా ఏ మాత్రం బిగువు తగ్గకుండా బాడీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతుంది.

ఇంతకీ సడెన్ గా రాశి ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే.. ఈ భారీ ముదురు భామ తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించబోతుంది. వైశాలి అనే పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ని విశ్వ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు కుమారన్ తెరకెక్కిస్తున్నారు. కుమారన్ రాశిా కోసమే ఈ వెబ్ సిరీస్ రాశాడట. రాశి అంటే ఆయనకు పిచ్చి అభిమానం అట.
Also Read: ఆ ఒక్క విషయం చెప్పమంటూ సుడిగాలి సుధీర్ ని రిక్వస్ట్ చేస్తున్న ఫ్యాన్స్… ఏంటంటే ?
ఆ అభిమానం నచ్చే, రాశి ఈ వయసులో కూడా స్టెప్స్ వేయడానికి అంగీకరించింది. కాగా ఈ నెల మూడో వారం నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగనుంది. ఈ షూట్ లో రాశితో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొనాబోతున్నారు. ఏమైనా 90లలో తెలుగు, తమిళ భాషలలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రాశి, మొదటిసారి ఇలా ఓ వెబ్ సిరీస్ చేయడం, పైపెచ్చు రాశి ఈ సిరీస్ లో ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం.
అలాగే కాస్త గ్లామర్ డోస్ కూడా ఈ సిరీస్ కోసం రాశి కురిపిస్తుండటంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి ఉంది. అలాగే ఆమె పాత్ర చాలా కామిక్ గా ఉండనుందని తెలుస్తోంది. మరి రాశి కామెడీ చేయగలదా చూడాలి. గతంలో రాశి నటించిన చాలా సినిమాలు చూస్తే.. రాశి అమాయకమైన రొమాంటిక్ కామెడీని బాగా చేస్తోంది. ఆయితే సీరియస్ కామెడీని ఎలా చేస్తోందో చూడాలి.
Also Read: పెళ్లి అప్పుడే అంటూ క్లారిటీ ఇచ్చిన నటి సాయి పల్లవి… ఎప్పుడంటే ?