Priyanka Jawalkar: కథ డిమాండ్ చేస్తే ఏ పాత్ర అయిన చేస్తా అంటున్న ప్రియాంక జవాల్కర్…

Priyanka Jawalkar: యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో హీరోయిన్ గా మొదలైన తన ప్రయాణం వెండితెరపై మెరిసేలా నటించారు ప్రియాంక జువాల్కర్‌. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన”టాక్సీవాలా” చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు ఈ ముద్దుగుమ్మ.ఆ తరవాత ‘ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం’, ‘తిమ్మరుసు’వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. ప్రస్తుతం లేడీ డైరెక్టర్ సంజనారావు సృజన రావు దర్శకత్వంలో ఉపకథల సమ్మేళనంగా తెరకెక్కిన చిత్రం “గమనం”.ఈ నెల 10న […]

Written By: Raghava Rao Gara, Updated On : December 6, 2021 8:17 pm
Follow us on

Priyanka Jawalkar: యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో హీరోయిన్ గా మొదలైన తన ప్రయాణం వెండితెరపై మెరిసేలా నటించారు ప్రియాంక జువాల్కర్‌. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన”టాక్సీవాలా” చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు ఈ ముద్దుగుమ్మ.ఆ తరవాత ‘ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం’, ‘తిమ్మరుసు’వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. ప్రస్తుతం లేడీ డైరెక్టర్ సంజనారావు సృజన రావు దర్శకత్వంలో ఉపకథల సమ్మేళనంగా తెరకెక్కిన చిత్రం “గమనం”.ఈ నెల 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రియాంక జువాల్కర్‌ ఒక ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ముచ్చటించారు.

Also Read: NTR: ఎన్టీఆర్ తో పోటీపడి ఆస్తులను పోగొట్టుకున్న స్టార్ !

ఈ సినిమాలో నేను ఓ ముస్లిం అమ్మాయి పాత్రలో “ఝూరా”గా కనిపిస్తాను.ఈ పాత్ర కోసం నన్ను ఆడిషన్‌ కూడా చేశారు బుర్ఖాలో ఎలా కనిపిస్తానో అనే లుక్‌ టెస్ట్‌ చేసి ఓకే చేశారు.ఈ పాత్రకు డైలాగులు చాలా తక్కువగా ఉంటాయి కొన్ని సన్నివేశాలు కేవలం కళ్లతోనే నటించాను అప్పుడు కాస్త కష్టంగా అనిపించింది కానీ ఇదో కొత్త అనుభవం అని అన్నారు ప్రియాంక. అయితే నేను తెల్లగా ఉంటాను కమర్షియల్‌ కథలకు మాత్రమే పనికొస్తానని అందరూ అనుకుంటారు. నాకు విలేజ్‌ అమ్మాయి పాత్రలు సెట్‌ కావు అనుకుంటారు కానీ ఈ సినిమా చూశాక ఆ అభిప్రాయం మారుతుంది. ‘గమనం’ కథ వినగానే నచ్చింది ఆ పైగా ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారని చెప్పారు ఇంకా ఏమీ ఆలోచించకుండా ఓకే చేశాను.కథ డిమాండ్‌ చేస్తే బోల్డ్‌గా నటించడానికి కూడా సిద్ధమే అని చెప్పుకొచ్చారు ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో శ్రియ,శివ కందుకూరి, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలో నటించారు.క్రియ ఫిల్మ్‌ క్రాప్‌, కాళీ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించారు ఇళయరాజా సంగీతం అందించారు.

Also Read: OTT Releases of the Week: ఈ వారం ‘ఓటీటీ’ రిలీజ్ ల పరిస్థితేంటి ?