Priya: ‘బిగ్ బాస్ తెలుగు 5’ను కుర్రాళ్ళు, అంకుల్స్ ఆసక్తిగా చూడటానికి ఉన్న ముఖ్య కారణాల్లో ప్రియ ఆంటీ ఒక కారణం. అలాంటిది ఆమెను ఎలా ఎలిమినేట్ చేస్తారు ? అంటూ బిగ్ బాస్ పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. అసలు మిర్చి ప్రియ లేనిది మేము బిగ్ బాస్ చూడలేం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ప్రియ ఫాలోయింగ్ చూశాక, ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. అసలు ప్రియకి ఈ రేంజ్ క్రేజ్ ఉందా అని.

ఎంత క్రేజ్ ఉన్నా, ఎంత గ్లామర్ ఉన్నా ఉపయోగం ఏముంది ? హౌస్ లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. బయటికి వచ్చింది. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ లో ఫెవరైట్లలో బెస్ట్ గా ఉన్న ప్రియ ఏడు వారాల్లోనే బయటకు వస్తోంది అని ఎవరూ అనుకోలేదు. సరే, కొంతమంది గేమ్ ప్లాన్ కారణంగా ప్రియ నలిగిపోయింది. వాళ్ళ ట్రాప్ లో పడి, తన విలువ కోల్పోయింది. ఇంతకీ ప్రియ ఇన్నాళ్లు హౌస్ లో ఉన్నందుకు ఎంత పారితోషికం తీసుకుంది ?
ఇప్పుడు సోషల్ మీడియా నిండా ఇదే హాట్ టాపిక్. ప్రియకు ఎంత ఇచ్చారు ? ఏడు వారాలు ఉంది కాబట్టి.. బాగానే వెనుక వేసి ఉంటుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే, నిజానికి ప్రియకు ఇచ్చింది వారానికి రెండు లక్షల రూపాయలు మాత్రమే. అదేంటి ? నటిగా ప్రియ రోజుకు 70 వేలు తీసుకుంటుంది. అలాంటిది వారం మొత్తం ఎన్నో టాస్క్ లను అనుభవించి రెండు లక్షలకే పరిమితం అవ్వాల్సిన అవసరం ఏముంది ? ప్రియకే తెలియాలి.
ఏది ఏమైనా ఏడు వారాలు ఆమె హౌస్ లో ఉంది. అంటే ఏడు వారాలకి ఆమెకి వచ్చింది 14 లక్షల రూపాయలు. అదే ఆమె బయట సినిమాలు చేసుకుని ఉండి ఉంటే అంతకన్నా ఎక్కువ సంపాదించేది. కాకపోతే.. డబ్బు కన్నా బిగ్ బాస్ వల్ల ఎక్కువ పేరు, ప్రాచుర్యం వస్తుంది కాబట్టి.. ప్రియ డబ్బు గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇలా హౌస్ లోకి వెళ్లి నానా పాట్లు పడింది. ఈ లెక్కన ప్రియకి వర్కౌట్ కానట్లే.