https://oktelugu.com/

‘ప్రగతి’ ఆంటి నుండి మరో వీడియో వైరల్ !

వెండితెర పై మోడ్రన్ మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నేటి నటిమణుల్లో ‘ప్రగతి’ ఒకరు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా పర్ఫెక్ట్ చాయిస్‌ గా ఉన్నా.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం ఆమె సొంతం. ఇక ఈ లాక్ డౌన్ లో ప్రగతి సోషల్ మీడియాలో చేసిన సెన్సేషన్‌ గురించి.. ముఖ్యంగా లుంగి కట్టుకుని ఆమె వేసిన డ్యాన్సుల గురించి, ఆమె మాస్ స్టెప్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ వైపు […]

Written By:
  • admin
  • , Updated On : October 2, 2020 / 06:47 PM IST
    Follow us on


    వెండితెర పై మోడ్రన్ మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నేటి నటిమణుల్లో ‘ప్రగతి’ ఒకరు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా పర్ఫెక్ట్ చాయిస్‌ గా ఉన్నా.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం ఆమె సొంతం. ఇక ఈ లాక్ డౌన్ లో ప్రగతి సోషల్ మీడియాలో చేసిన సెన్సేషన్‌ గురించి.. ముఖ్యంగా లుంగి కట్టుకుని ఆమె వేసిన డ్యాన్సుల గురించి, ఆమె మాస్ స్టెప్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ వైపు డ్యాన్స్ లతో, మరో వైపు వర్కౌట్లతో మొత్తానికి ప్రగతి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఏభైలోకి ఎంట్రీ ఇచ్చాక కూడా, ప్రగతి 80 కేజీల బరువును ఎత్తేందుకు ప్రయత్నించింది. చూస్తుంటే కరణం మల్లీశ్వరి బయోపిక్ హీరోయిన్ కి పోటీ ఇచ్చేలా ఉంది.

    Also Read: టీజర్ టాక్: నందు-రష్మి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’యేనా?

    ఈ వర్కౌట్స్ వీడియోను సోషల్ మీడియాలోకి అప్ లోడ్ చేయడం, అది వైరల్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్లు ఫిట్‌నెస్ కోసం ఎంతగా కష్టపడతారో.. అంతకు పదింతలు ప్రగతి చెమటోడ్చటం చూస్తుంటే.. అలాగే జిమ్‌లో ఆమె పడే ప్రయాసలను ఆయాసలను చూస్తుంటే ఏమనాలో తెలియడం లేదు. ఏమైనా సినిమాల్లో ఆమె కనిపించే దానికి, నిజ జీవితంలో ఈమె ప్రవర్తించే దానికి చాలా తేడా ఉండేలా కనిపిస్తోంది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోలందరికీ అమ్మగానో, అత్తగానో నటించి మెప్పించిన ప్రగతి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మోడ్రన్ ఆంటీగా బాగా పాపులారిటీ సంపాధించుకుంది. పైగా కరోనా కాలంలో కూడా నెటిజన్లను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తూ ఉంది.

    Also Read: ముహుర్తం ఫిక్స్.. మహేష్, పవన్ రికార్డులను బ్రేక్ చేయనున్న ప్రభాస్..!

    ఈ ఏజ్ లో కూడా బ్రేకింగ్ డాన్స్ లు చేస్తూ.. శక్తికి మించిన బరువులు ఎత్తుతూ, ఆశ్చర్యం కలిగించే వర్కౌట్లు చేయడం అంటే మాటలా. నిజానికి ఈ లాక్‌ డౌన్ లో తెలుగు నటిమణుల్లో సురేఖా వాణి, అపూర్వ లాంటి చాలామంది సోషల్ మీడియాలో తమ శైలిలో రెచ్చిపోయారు. అయితే వారందరిలోకల్లా ప్రగతి ఆంటీ సాధించిన క్రేజ్, ఆవిడ సంపాదించుకున్న పాపులారిటీ అందరి కంటే ఎక్కువ. మరో నటీమణికి సాధ్యం కాని స్థాయిలో తనలోని బోల్డ్ డాన్స్ టాలెంట్ ను బయటపెట్టేసింది ప్రగతి. మరి రానున్న రోజుల్లో ప్రగతి ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో అర్ధం చేసుకోవచ్చు.