నిన్నటి తరం హోమ్లీ బ్యూటీ మీనా లేటు వయసులో కూడా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికీ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. ‘దృశ్యం’ సినిమా నుంచి మీనాకి ‘భార్య’ పాత్రలు దక్కుతున్నాయి. సీనియర్ హీరోల పాత్రలకు జోడిగా మీనా పర్ఫెక్ట్ గా సూట్ కావడంతో ఆమె కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది.
ఒక విధంగా హీరోయిన్ గా తన గ్లామర్ తో ఉక్కిరిబిక్కిరి చేసిన రోజులలోనే మీనా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేకపోయింది. కానీ ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి మరీ తీసుకుంటుంది. మిడిల్ ఏజ్ లో కూడా ఏ మాత్రం బిగువు తగ్గకుండా మెయింటైన్ చేస్తోన్న ఈ ముదురు భామ లిస్ట్ లో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి.
అందుకే, మీనా చాలా సంతోషంగా ఉంది. ఎలాగూ సంపాదన బాగుంది, కెరీర్ బాగుంది. అందుకే, బర్త్ డేలను ఘనంగా జరుపుకుంటూ సోషల్ మీడియాలో బాగా హడావుడి చేస్తోంది. రీసెంట్ గా మీనా 45వ పుట్టిన రోజు జరుపుకుంది. అయితే తన బర్త్ డే వేడుకలను చెన్నైలోని ఒక స్టార్ హోటల్ ల్లో ఏర్పాటు చేసింది.
బాగా ఖరీదైన ఆ హోటల్ లో బర్త్ డే సెలబ్రేట్ చేయాలి అంటే.. కనీసం 30 లక్షలు ఖర్చు పెట్టాలి. మీనా ఖర్చు పెట్టింది. పైగా ఈ పార్టీలో తన స్నేహితురాళ్ళకు మరో ప్రత్యేక పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి 15 మంది వచ్చారు. అందరూ గర్ల్ ఫ్రెండ్స్.
కాగా తన ఫ్రెండ్స్ తో ప్రత్యేక పార్టీ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మీనా. ఇక ఈ పార్టీలో ఒకప్పటి హీరోయిన్స్ స్నేహ, కన్హా వంటి వారు కూడా ఉండటం విశేషం.