Actress Madhavi Latha: హీరోయిన్‌గా తన తొలి సినిమాతోనే ‘నచ్చావులే’ అనిపించుకుంది తెలుగమ్మాయి మాధవీలత. ఆపై నాని హీరోగా ‘స్నేహితుడా’ చిత్రంతో కూడా ఆకట్టుకుంది. దాంతో, ఆమె కెరీర్ ఊపందుకుంటుంది అనుకుంటే రివర్సయింది. అవకాశాలు లేకపోవడంతో ఆమె తెరమరుగైంది. అయితే, ఆ మధ్య ‘మీ టూ’ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు, తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి వార్తల్లోకి వచ్చింది. ఆపై, సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీ విషయాల గురించి తరచూ స్పందిస్తోంది. అంతేకాదు బీజేపీ కండువా కప్పుకొని రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది. తాజాగా బిగ్ బాస్ షో పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది ఈ నటి.
Also Read: ఆర్ఆర్ఆర్ అలా.. రాధేశ్యామ్ ఇలా.. మధ్యలో భీమ్లానాయక్.. ఎవరికి కలిసివస్తుంది?
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగింది ఈ భామ. ఆ పోస్ట్ లో “ఏమయ్యా బిగ్ బాస్ ఏందయ్యా ఇది. ఆడ పిల్లను బానిసను చేసి నవ్వకూడదు, ఏడ్వకూడదు, వంగ కూడదు అంటూ ఓ ఆడపిల్లను మానసిక అత్యాచారం చేస్తున్నారు. వీకెండ్ లో నాగ్ మావ వచ్చి వగలు పోతారు. చివరికి నాగార్జునని కూడా టీఆర్పీ కోసం దిగజార్చేస్తున్నారు. ఒక కన్న తల్లి మాటకి విలువ లేకుండా చేస్తున్నారు. సభ్య సమాజానికి బిగ్ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నారు? హగ్గులు ఇచ్చేస్తున్న వాడికే కప్ తగలబెట్టడండి. అలాంటి వాడికే బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. ఇలాంటి వాడికి కిరీటం ఇస్తే బీబీ కొంప మీద ఫైర్ యాక్సిడెంట్ అయి సెట్ తగలబడిపోవడం ఖాయం. హగ్గులు,కిస్సులు, పక్కోడి పెళ్లాన్ని వాటేసుకోవడం, స్నేహం ముసుగులో కామకలాపాలు చూడలేకపోతున్నాం. బీబీ చివరి ఎపిసోడ్ చూసి మీ నిర్ణయం సమాజానికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే షో పై డైరెక్ట్ గా గా సుప్రీం కోర్టులో కేసు వేస్తా, హైకోర్టుల కూడా ఓ పిల్ పడేస్తాను. ఇది జోక్ కాదు చాలా సీరియస్ అంటూ పోస్ట్ పెట్టింది మాధవీలత. బిగ్ బాస్ షోపై విమర్శలు రావడం ఇదేం కొత్తకాదని చెప్పాలి. గతం లోనూ ఈ షో పై చాలా విమర్శలొచ్చాయి. అయితే నెగెటివ్ కామెంట్స్ కూడా షోకి ప్లస్ అవుతాయంటూ తమపని తాము చేసుకుపోతున్నారు నిర్వహకులు.