Pushpa Movie: అల్లు అర్జున్ “పుష్ప” ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఫిక్స్… ఎక్కడంటే ?

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. కాగా రెండు భాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 10, 2021 2:32 pm
Follow us on

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. కాగా రెండు భాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.అల్లు అర్జున్ పుష్ప క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అలానే కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Pushpa Movie

Also Read: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసిన అల్లు అర్జున్ “పుష్ప: సినిమా…

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి . ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు చిత్రబృందం. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. డిసెంబర్ 12 న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్ట్ లో “థియేటర్లో కన్నా ముందే మాస్ పార్టీ.. మాస్ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న గ్లింప్స్.. పుష్ప మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీ.. డిసెంబర్ 12 న” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్టర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ లుగా ఎవరు రానున్నారో ఇంకా క్లారిటి రావాల్సి ఉంది. ఈ ఈవెంట్ కి ప్రభాస్, చిరు, షాహిద్ కపూర్ గెస్టులుగా వస్తున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

https://twitter.com/PushpaMovie/status/1468913568292610049?s=20

Also Read: బాప్ రే.. పుష్ప మూవీ అన్ని గంటలా?