Jayaprada Mother: ఒకప్పటి అందాల తార, సీనియర్ హీరోయిన్ జయప్రద ఇంట్లో బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. జయప్రద గారు తల్లి ‘నీలవేణి’ గారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. అయితే, తన తల్లిగారు చనిపోయారు అనే విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో నివసిస్తున్న జయప్రద గారు హుటాహుటిన బయలుదేరి వచ్చారు.

కాగా నీలవేణి గారి అంత్యక్రియలు నేడు హైదరాబాద్ లో జరుగనున్నాయి. ఇక సినీ ప్రముఖులు జయప్రద తల్లి మృతి పట్ల తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జయప్రద బీజేపీలో యాక్టివ్‌గా ఉన్నారు. జయప్రదకి తన తల్లి నీలవేణి అంటే ఎంతో ఇష్టం. నీలవేణి ఆరోగ్యం విషయంలో జయప్రద గారు ఇన్నాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. కానీ, నీలవేణి గారు గత కొంతకాలంగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

Also Read: పవన్, బన్నీ, రవితేజ, ధనుష్.. ఆ పొరపాటు చేయకుండా ఉండాల్సింది !
అయితే, గత వారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె గుండెపోటుతో చిత్ర మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. జయప్రదను నటిగా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చిన దగ్గర నుంచి నీలవేణి గారు జయప్రద వెంటే ఉన్నారు.

Also Read: పదేండ్ల క్రితం తెలుగు హీరోల రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. తన చివరి క్షణం వరకూ ఆమె తన కూతురు కోసమే బతికారు. కాగా మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున నీలవేణి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
[…] […]
[…] […]