Hema daughter marriage: వెండితెర పై కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా దశాబ్దాల నుండి నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటి హేమ. సినిమాల ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరైన ఈమె, సోషల్ మీడియా లో యాక్టీవ్ ఉంటూ ఇంకా బాగా దగ్గరైంది. బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని, బుల్లితెర ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరైంది. అయితే ఈమధ్య హేమ చుట్టూ ఎన్నో వివాదాలు అలుముకున్న సంగతి తెలిసిందే. బెంగళూరు లో జరిగిన ఒక రేవ్ పార్టీ లో ఈమె మలకద్రవ్యాలు సేవించింది అంటూ ప్రచారం జరగడంతో పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకొని పలు టెస్టులు నిర్వహించారు. చివరికి ఆమెకు క్లీన్ చిట్ వచ్చింది. అంతే కాకుండా ఈమె తన భర్త తో విడిపోయింది అంటూ కూడా వార్తలు వచ్చాయి, అంతే కాకుండా తన కూతురు ఈషా ఒక స్టార్ హీరో ని పెళ్లాడబోతుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.
వీటి అన్నిటికి ఈమె రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా తన కూతురు ఈషా గురించి మాట్లాడుతూ ‘ఈషా చాలా చిన్న పిల్ల. కేవలం 20 ఏళ్ళు మాత్రమే. ఆమెకు 25 వచ్చే వరకు పెళ్లి చేసే ఉద్దేశ్యం లేదు , సోషల్ మీడియా లో వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదంటూ ‘ చెప్పుకొచ్చింది. మీరు మీ కూతుర్ని ఇండస్ట్రీ లోని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా ?, లేదా బయట వాళ్లకు ఇచ్చి పెళ్లి చేస్తారా ? అని అడగ్గా, ‘నాకు ఎలాంటి పట్టింపులు లేవు, మంచి అబ్బాయి అయితే చాలు’ అంటూ చెప్పుకొచ్చింది. తన కూతురు ఈషా గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఆమె జోడీ చేస్తోంది. ఇంట్లో కారు ఉన్నప్పటికీ కూడా, ప్రతీ రోజు ఆఫీస్ కి ఆమె ఆటోలోనే వెళ్లి వస్తూ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: హీరో విజయ్ పార్టీ పెట్టడానికి కారణం త్రిష..? పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఈషా కి వ్యాపారం చేయడం పై చాలా ఆసక్తి ఉంది. అయితే అంతకంటే ముందు ఉద్యోగం లో ఓనర్ మరియు జాబ్ చేసే వాళ్ళ మధ్య టర్మ్స్ ఎలా ఉంటాయి అనేది పరిశీలించడానికే ఇప్పుడు ఆమె జాబ్ చేస్తోంది ‘ అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన భర్త తో విడాకుల విషయం పై స్పందిస్తూ ‘ఇలాంటి పనికిమాలిన రూమర్స్ ని ఎలా పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. నేను నా భర్త తల్లి కొడుకులు లాగా ఎంతో ఆప్యాయంగా ఉంటాము ‘ అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈమధ్య కాలం లో పెద్దగా సినిమాల్లో నటించలేదని, అవకాశాల కోసం ఎప్పుడూ ఎవ్వరిని అడగలేదని , కానీ ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ కోసం డైరెక్టర్స్ ని సంప్రదిస్తున్నామని, ఇంతకు ముందు లాగా కాకుండా, ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేయడానికి ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు చెప్పుకొచ్చింది హేమ.