Actress Hema Arrested 14 Days Remand
Actress Hema: నటి హేమకు బిగ్ బాస్ షాక్ తగిలింది. రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించారు. మే 19వ తేదీన బెంగుళూరు(Banglore) శివారులో గల ఓ ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ(Rave Party) నిర్వహించారు. వాసు అనే వ్యక్తి బర్త్ డే నేపథ్యంలో ప్రముఖులతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి నటి హేమ సైతం హాజరైంది. రేవ్ పార్టీలో నిషేదిత ఉత్ప్రేరకాలు వాడుతున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు దాడి చేశారు. దాదాపు వంద మంది ఈ పార్టీకి హాజరయ్యారు. వారిలో నటి హేమ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని బెంగుళూరు పోలీసులు ధృవీకరించారు. అయితే ఈ ఆరోపణలను హేమ కొట్టిపారేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వార్తల్లో నిజం లేదన్నారు. మీడియాను తప్పుదోవ పట్టించిన హేమ బెంగుళూరు ఫార్మ్ హౌస్ నుండే ఆ వీడియో విడుదల చేసినట్లు తెలిసింది.
Also Read: NTR-Prashanth Neel: ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?
హేమ విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపారు. అనారోగ్య కారణాలు చూపుతూ హేమ విచారణకు హాజరు కాలేదు. మూడోసారి కూడా హేమకు నోటీసులు జారీ చేయడంతో హేమ హాజరయ్యారు. ఆమెకు రక్త పరీక్షలు నిర్వహించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో హేమను అరెస్ట్ చేశారు. నాలుగో అదనపు సివిల్, జే ఎం ఎఫ్ సి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. జూన్ 14 వరకు ఆమెకు జడ్జి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Also Read: Kalki 2898 AD : కల్కి’లో బుజ్జి కాపీనా… ప్రభాస్ పెదనాన్న సినిమా నుండే లేపేసిన నాగ్ అశ్విన్!
హేమ బెంగళూరు వేదికగా టాలీవుడ్ పరువు తీసింది. కాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ హేమ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. గతంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయంపై స్పందించారు. హేమ నేరం చేశారని రుజువు అయ్యేవరకు ఆరోపణలు చేయడం సరికాదు. ఒకవేళ ఆమె నిజంగా తప్పు చేసిందని తెలిసిన రోజున చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. హేమ మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కొనసాగుతుంది.
Web Title: Actress hema arrested 14 days remand
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com