Homeఎంటర్టైన్మెంట్Divyansha Kaushik: 'మైఖేల్'​ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'మజిలీ' హీరోయిన్​?

Divyansha Kaushik: ‘మైఖేల్’​ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘మజిలీ’ హీరోయిన్​?

Divyansha Kaushik: ప్రస్తుతం టాలీవుడ్​లో కొత్త హీరోయిన్ల హవా నడుస్తోంది. చేసిన తొలి సనిమాతోనే అంద చందాలతో ప్రేక్షకుల మనసును గెలిచి.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటూ.. కెరీర్​లో వరుస అవకాశాలతో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. అలా టాలీవుడ్​లో రాణిస్తోన్నయంగ్​ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కాగా, తన అందం అభినయంతో మజిలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్​ అండ్ హాట్ హీరోయిన్​ దివ్యాన్ష కౌశిక్​. సమంత- నాగ చైతన్య జంటగా నటించిన ఈ సినిమాలో దివ్యాన్షి ఓ కీలక పాత్ర పోషించింది. నిజానికి సినిమా మొత్తం ఈమె చుట్టే తిరుగుతుంది. ఇలా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సుపరిచితమైన దివ్యాన్ష.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్లిపోతోంది.

actress-divyashna-kaushik-will-act-in-sandeep-kishan-and-vijay-sethupathi-movie-micheal

ప్రస్తుతం మాస్​మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది దివ్యాన్ష. శరత్​ మండవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజాగా, ఈ హాట్ బ్యూటీ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. యంగ్​ హీరో సందీప్ కిషన్​ ప్రధాన పాత్రలో వస్తోన్న మైఖేల్​ సినమాలో హీరోయిన్​గా కనిపించనున్నట్లు సమాచారం.  భారీ యాక్షన్ ఫిల్మ్​గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మక్కల్​ సెల్వన్ విజయ్​ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.

ఈ సినిమాను తెలుగుతో పాటు 5 ప్రధాన భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్ ఎల్ఎల్పి బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణంలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఇందులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్​గా నటిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular