https://oktelugu.com/

భర్తకు ‘ప్రముఖ నటి’ విడాకులు.. కారణాలు దారుణాలే !

హిందీ నటి ‘అర్జూ గోవిత్రికర్‌’ మంచి నటి అని, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ఆమెకు మంచి పేరు ఉంది. కానీ, ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కారణం భర్త సిద్ధార్థ్‌ శబర్వాల్‌ నుంచి విడాకులు తీసుకునేందుకు ఆమె సిద్ధం అవ్వడమే. నిజానికి అర్జూ 2019లోనే తన భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, ఆ తర్వాత ఆమె భర్త కాంప్రమైజ్ కావడంతో అతనితో సర్దుకుపోయింది. అయితే, ఈ రెండేళ్ల […]

Written By:
  • admin
  • , Updated On : August 5, 2021 / 11:56 AM IST
    Follow us on

    హిందీ నటి ‘అర్జూ గోవిత్రికర్‌’ మంచి నటి అని, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ఆమెకు మంచి పేరు ఉంది. కానీ, ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కారణం భర్త సిద్ధార్థ్‌ శబర్వాల్‌ నుంచి విడాకులు తీసుకునేందుకు ఆమె సిద్ధం అవ్వడమే. నిజానికి అర్జూ 2019లోనే తన భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, ఆ తర్వాత ఆమె భర్త కాంప్రమైజ్ కావడంతో అతనితో సర్దుకుపోయింది.

    అయితే, ఈ రెండేళ్ల కాలంలో అతడిలో మార్పు రాకపోగా, ఆమెను మరింతగా వేధించాడు. దాంతో ఇక తన భర్తతో విడిపోవాలని ఆమె నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అర్జూ గోవిత్రికర్‌ మాట్లాడుతూ.. ‘నా పై వస్తోన్న వార్తలు నిజమే. నేను నా భర్త నుండి విడాకులు కోరుకుంటున్నాను. విడాకుల కోసం దరఖాస్తు చేయడం జరిగింది. నా పై విమర్శలు చేసేవారికి తెలియదు, నేను ఎన్ని బాధలు భరించానో.. అని ఎమోషనల్ అవుతూ…

    కళ్ళల్లో నుండి కన్నీళ్లు తుడుచుకుంటూ.. “ఏ అమ్మాయి అయినా భర్తతో సంతోషంగానే ఉండాలనుకుంటుంది. నేను కూడా అలాగే అనుకున్నాను. అందుకు ఎంతో ప్రయత్నించి చూశాను, కానీ.. నా భర్త సిద్దార్థ్‌ తో కలిసుండటం ఇక నాకు సాధ్యపడదు అనిపించింది. అతను నా పట్ల చాలా దారుణాలు చేశాడు. నన్ను మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి ప్రయత్నించాడు.

    ఎన్నో సార్లు అతను నాపై చేయి చేసుకున్నాడు, అతను కడుపులో తన్ని నప్పుడు కలిగిన బాధ, ఇంకా నా గుండెల్లో నొప్పిని కలిగిస్తూనే ఉంది. నేనెప్పుడూ ఆ గాయాలను బయటకు చూపించాలనుకోలేదు. అయితే, నా భర్త మరో అమ్మాయితో చేసిన చాటింగ్‌, ఆమెతో పెట్టుకున్న అక్రమ సంబంధం, ఇక నా పై చేసిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు నా దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలే నాకు న్యాయం చేస్తాయని నమ్ముతున్నాను’ అంటూ అర్జూ ఎమోషనల్ అవుతూ చెప్పింది.