
తెలుగు ఇండస్ట్రీలో హాట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన అతి కొద్దిమందిలో ‘అపూర్వ’ ఆంటి ఒకరు. ఏజ్ అయిపోయినా ఇంకా హాట్ లుక్స్ లో కనిపించడానికి చాలా కష్టపడుతూ ఫోటో షూట్స్ ను కూడా చేస్తోంది ఈ ఆంటి. ఏది ఏమైనా అపూర్వ అంటే.. అదొక తెలియని ఆకర్షణ అంటున్నారు యువత. సినిమాల్లో పెద్దగా స్టార్ డమ్ రాకపోయినా, తానూ తన దారిలోనే వెళ్తూ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి లేటు వయసులో కూడా తెగ తాపత్రయ పడుతోంది. అందుకే అపూర్వ అనగానే ఇప్పుడు కుర్రకారు కూడా బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సహజంగానే కాస్త గ్లామర్ గా ఉండే అపూర్వకు, నెటిజన్లు కూడా కాస్త క్రేజ్ ను కట్టబెడుతున్నారు.
Also Read: కశ్యప్ పై ఆరోపణ.. తాప్సీ హాట్ కామెంట్స్
చాలా సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించి మెప్పించిన ఈ ఆంటీ.. ఇప్పుడు కూడా కుర్రకారుకు తనలోని గ్లామర్ ఫీచర్స్ ను ఏ మాత్రం మొహమాటపడకుండా చూపిస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే.. గ్లామర్ వడ్డించాల్సిందే అని అపూర్వకు ఎవరో చెప్పినట్టు ఉన్నారు. అందుకే ఈ మధ్య అపూర్వ కూడా సోషల్ మీడియాలో నిత్యం అప్ డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే పనిలో పడింది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతూ.. కుర్రాళ్ళను తెగ ఆకట్టుకుటుంది. ఫోటోలో ఫుల్ ఎక్స్ పోజింగ్ తో మసలా లుక్స్ లో మెరిసిపోతూ ఉంది అపూర్వ.
Also Read: సుశాంత్ ఆత్మహత్య.. బయటపడుతున్న డర్టీ సిక్రెట్స్.!
మొదటి నుండి సినిమాల్లో హాట్ హాట్ క్యారెక్టర్స్ తో రచ్చ చేసే అపూర్వ.. అల్లరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. తెర పై శృంగారభరితమైన పాత్రలలోనే ఎక్కువగా నటిస్తూ వచ్చిన అపూర్వ.. గత కొంతకాలంగా తన ఫిజిక్ మీద దృష్టి పెట్టిందట. ఆ రకంగా సోషల్ మీడియాలో హాట్ లుక్ లో తన ఫిజిక్ ను చూపిస్తూ రచ్చ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా తన క్యారవాన్ లో తాను ఎలా ఉంటుందో అని హాట్ స్టిల్ ను ఒకటి పోస్ట్ చేస్తూ చెప్పుకొచ్చింది. మనకున్న ప్యాషనే, మనల్ని మన వృత్తిలో ముందుకు తీసుకువెళ్తుంది అంటూ చివరగా అదిరిపోయే హాట్ ఫోటోను షేర్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఫోటో పై నెటిజన్లు కూడా మనసు పారేసుకుంటూ.. ‘బాగున్నారు.. సూపర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.