Anu Emmanuel: “మజ్ను” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అను ఇమ్మానియేల్. ఈ చిత్రం ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకొని వరుస సినిమాలతో బిజీ అయిపోతుంది అనుకున్నారు.అయితే ఈ అమ్మడికి అంత కలిసి రాలేదనే చెప్పాలి ఆక్సిజన్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, సైలజా రెడ్డి అల్లుడు వంటి చిత్రాల్లో నటించిన ఈ చిత్రాలు ప్రేక్షకులలో అంతగా ఆదరణ దక్కలేదనే చెప్పాలి.

అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అను జంటగా నటించిన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా”సినిమాతో అను ఫేట్ మారిపోతున్న అనుకున్నారు. ఈ చిత్రం కూడా ఈ భామకు సక్సెస్ రుచిని చూపించలేదు, అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” సినిమాతో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది అనుకున్నారు. ఈ చిత్రం కూడా ఈ భామను నిరాశ పరిచింది అను ఇండస్ట్రీకొచ్చి ఆరేడేళ్లు అవుతున్నా ఇప్పటివరకు సాలీడ్ హిట్ అంటూ ఒక్కటి కూడా తన ఖాతాలో చేరలేదు.
ఇటీవలే విడుదలైన ‘మహా సముద్రం’ సినిమా మీద అను ఇమ్మాన్యుయేల్ చాలా ఆశలు పెట్టుకుంది అనే చెప్పాలి. ఈ సినిమా గనక సూపర్ హిట్ అయి ఉంటే ఈమె కెరియర్ మరో దశలో ఉండేదేమో. కానీ ఆశించిన సక్సెస్ ‘మహా సముద్రం’ ఇవ్వలేకపోయింది, ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదేమో,… అందుకే సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో అభిమానులకు, మేకర్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుత కాలంలో ఉన్న తారలంతా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు అనూ కూడా అదే బాటలో వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. అందులో భాగంగానే కాస్త బోల్డ్‌గా ఉన్న లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో మేకర్స్ లుక్స్ తనవైపు పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.చూడాలి మరి ఈమె ప్రయత్నాలు ఎంతవరకు సాఫల్యం అవుతాయో..