https://oktelugu.com/

Annapurna-Chinmayi: అర్ధరాత్రి ఆడవాళ్లకు ఏం పని? నటి అన్నపూర్ణ వివాదాస్పద కామెంట్స్… సింగర్ చిన్మయి ఫైర్!

చిన్మయి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆడవారిని ఎవరైనా కించపరుస్తూ మాట్లాడినా ఆమె సహించరు. వెంటనే వారికి గట్టి కౌంటర్లు ఇస్తూ కాంట్రవర్సీ కి గురవుతూ ఉంటారు. కాగా సీనియర్ నటి అన్నపూర్ణ ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్ల స్వేచ్ఛ గురించి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను షేర్ చేసింది చిన్మయి. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 / 12:24 PM IST

    annapurna chinmayi

    Follow us on

    Annapurna-Chinmayi: సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది చిన్మయి శ్రీపాద. ఈమె కరుడుగట్టిన ఫెమినిస్ట్ అన్న విషయం తెలిసిందే. రచయిత వైర ముత్తు మీద ఆమె అలుపెరుగని పోరాటం చేసింది. వైర ముత్తు అనేక మంది అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. చిన్మయి నచ్చని విషయాన్ని ఖండించడానికి అస్సలు వెనుకాడరు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం రేపుతుంతాయి.

    చిన్మయి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆడవారిని ఎవరైనా కించపరుస్తూ మాట్లాడినా ఆమె సహించరు. వెంటనే వారికి గట్టి కౌంటర్లు ఇస్తూ కాంట్రవర్సీ కి గురవుతూ ఉంటారు. కాగా సీనియర్ నటి అన్నపూర్ణ ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్ల స్వేచ్ఛ గురించి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను షేర్ చేసింది చిన్మయి. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

    సదరు వీడియో లో అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ .. ‘ అర్ధరాత్రి స్వాతంత్య్రం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఆడవాళ్లకు ఏం పని?. ఇప్పుడు ఎక్స్ పోజింగ్ ఎక్కువైపోయింది. ఎప్పుడూ ఎదుటి వాళ్లదే తప్పు అనకూడదు. మన వైపు కూడా కొంచెం ఉంటుంది… అని అభిప్రాయ పడింది. ఆ మాటలను ఖండిస్తూ చిన్మయి .. ఆమె ఇలా మాట్లాడుతుంటే గుండెముక్కలైనట్లు అనిపిస్తుంది, అన్నారు.

    ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా… సూర్యోదయం సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్ కి వెళ్లినా ఆమె చెప్పినట్లు రాత్రిపూట లేడీ డాక్టర్లు ఉండొద్దు. ఒంట్లో బాగోలేక పోయినా రాత్రి హాస్పిటల్ లో ఉండకూడదు. ఇప్పటికి చాలా ఊర్లలో ఇంట్లో వాష్ రూమ్ లేక సూర్యోదయానికి ముందే పొద్దున్నే 3 గంటలకు లేచి పొలం గట్లకు వెళ్లే ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా అలాంటి వారిపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా అని ఎదురు చూస్తున్న వారు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. భారత్ లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ అని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు.