Sonali Phogat Passed Away: మరణం ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.. ఊహించని ఉపద్రవంలా వచ్చిపడుతుంది. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ను ఇలానే వెంటాడిన మృత్యువు.. తాజాగా బిగ్ బాస్ బ్యూటీని కూడా తీసుకెళ్లింది. సోషల్ మీడియా స్టార్, బీజేపీ నాయకురాలు.. బిగ్ బాస్ బ్యూటీ అయిన సోనాలి ఫోగట్ ఆకస్మిక మరణం అందరినీ షాక్ కు గురిచేసింది.
41 ఏళ్ల వయసులోనే సోనాలి కన్నుమూయడం విషాదం నింపింది. గోవాకు ఫ్రెండ్స్ తో కలిసి పర్యటనకు వెళ్లిన సోనాలి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. మరణానికి కొన్ని గంటల ముందు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేసింది. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోనాలి టిక్ టాక్ తో ఫేమస్ అయ్యింది. ఈమె సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోలు, వీడియోలన్నింటిని ఎప్పటికప్పుడు రీల్స్ రూపంలో అభిమానులతో షేర్ చేస్తుంటుంది. సోనాలి చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా తన చివరి వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో పింక్ టర్బన్ ధరించి బాలీవుడ్ రెట్రో పాట ‘రుఖ్ సే నఖబ్ హతా దో’ పాటను రీల్స్ గా చేస్తూ తన అందమైన హావభావాలతో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో సోనాలి ఎంతో హ్యాపీగా స్టైలిష్ గా ఉంది. అంతలోనే ఆమెను మృత్యువు వెంటాడడం కలిచివేస్తోంది.
1979 సెప్టెంబర్ 21న సోనాలి ఫోగట్ హర్యానాలోని ఫతేహాబాద్ లో జన్మించారు. 2006లో ఆమె హిసార్ దూరదర్శన్ లో యాంకరింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. 2008లో బీజేపీలో చేరారు. వివాదాస్పద వ్యాఖ్యలు, చర్చల్లో పాల్గొంటూ ఫేమస్ అయ్యారు. 2020లో ఓ అధికారిని చెప్పుతో కొట్టి ఈమె వివాదాస్పద లేడీగా ముద్రపడ్డారు. బిగ్ బాస్ మిందీ సీజన్ 14లో కంటెస్టెంట్ గా పాల్గొని పాపులర్ అయ్యారు.
గోవా టూర్ లో అకస్మాత్తుగా సోనాలి మరణం అందరినీ షాక్ కు గురిచేసింది. ఆమె భర్త కూడా 2016లో హిస్సార్ లోని ఓ ఫాంహౌస్ లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
సోనాలి చివరి వీడియో ఇదీ..
https://www.youtube.com/watch?v=wmFXK4RWUEE&t=2s