https://oktelugu.com/

Anasuya Bharadwaj : అనసూయ కొంటె చూపులకు బెండ్ అవ్వని మగాడుండడు.. వైరల్ ఫొటోలు

నీలం, ఆకుపచ్చ సమ్మేళతమైన రంగుతో కూడిన లెహంగా ధరించి అనసూయ అలరించారు. వయ్యారాలు వలకబోస్తూ ఫోటోలు దిగారు. వాటిని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 3, 2024 / 09:43 PM IST
    Follow us on

    Anasuya Bharadwaj : న్యూస్ రీడర్ గా.. జబర్దస్త్ లో యాంకర్ గా.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. అనసూయ ప్రస్థానం గురించి చెప్పాలంటే ఇన్ని కోణాలు ఉన్నాయి. బుల్లితెరపై, వెండితెరపై ఆమె సూపర్ సక్సెస్ అయ్యారు. ప్రత్యేకించి జబర్దస్త్ కామెడీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. క్షణం సినిమాలో నెగటివ్ పాత్ర పోషించి అలరించారు. సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాలో చిన్న కామియో రోల్ చేశారు. యాత్ర సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో నటించారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో ఆమె నటించారు అనేకంటే జీవించారు అని చెప్పొచ్చు. ఆ పాత్ర తర్వాత ఆ పేరే ఆమెకు స్థిరపడిపోయింది అంటే అతిశయోక్తి కాదు.

    రంగమ్మత్త ద్వారా విపరీతమైన పాపులారిటీ వచ్చినప్పటికీ అనసూయ జబర్దస్త్ ను విడిచిపెట్టలేదు. మొన్నటిదాకా ఆ షో లో యాంకర్ గా కొనసాగారు. మా టీవీ, జీటీవీలో ప్రసారమైన కొన్ని షో స్ కి యాంకర్ గా కూడా వ్యవహరించారు. కొంతకాలం నుంచి జబర్దస్త్ లో కనిపించడం లేదు. అయితే వెండి తెర మీద ఆమె మెరుస్తూనే ఉన్నారు. పుష్ప సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ విమర్శకుల ప్రశంసలు పొందారు. ప్రేమ విమానం, పెద్దకాపు అనే సినిమాలతో అలరించారు. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటారు. తనను అనుసరించే వారితో చాలా విషయాలు షేర్ చేసుకుంటారు.. ఆమెకు సంబంధించిన కొత్త కొత్త ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటారు. ఆమె అప్లోడ్ చేయడమే ఆలస్యం ఫోటోలు వెంటనే వైరల్ అవుతుంటాయి. అయితే కొన్నిసార్లు అవి వివాదాలకు కూడా దారితీస్తుంటాయి.

    కేవలం సాంప్రదాయ దుస్తులు మాత్రమే కాదు, అధునాతన దుస్తులు ధరించి ఫోటోషూట్లతో అనసూయ సందడి చేస్తుంటారు. అవి కుర్రకారును ఆకట్టుకుంటాయి. ఆ మధ్య తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు అధునాతన దుస్తులు ధరించి దిగిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అవి వైరల్ గా మారాయి.. తాజాగా నీలం, ఆకుపచ్చ సమ్మేళతమైన రంగుతో కూడిన లెహంగా ధరించి అనసూయ అలరించారు. వయ్యారాలు వలకబోస్తూ ఫోటోలు దిగారు. వాటిని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.