Actress Anandhi Photos Viral: మనం చెప్పుకోబోయే తెలుగు హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే జాబితాకు చెందింది. ఈ తెలుగు ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కంటే కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు డి గ్లామర్ లుక్ లో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. ఈమె తెలుగులో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్ ప్రారంభంలో ఎక్కువగా డి గ్లామర్ లుక్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలలో తన అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. ఈ హీరోయిన్ వరంగల్ లో పుట్టి పెరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2012లో రిలీజ్ అయిన ఒక సినిమాతో సినిమా ఇండస్ట్రీలో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తొలి సినిమాతోనే తన అందంతో, నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు అందుకుంది. రెండో సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది.
కానీ ఆ తర్వాత ఆమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళింది. అక్కడ ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించి కోలీవుడ్ సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ఈ తెలుగు బ్యూటీ. ఆ సమయంలోనే మళ్ళీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా చేసే అవకాశం అందుకుంది. ప్రస్తుతం తమిళ్ తో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ఈ హీరోయిన్ మరెవరో కాదు ఆనంది. కాయల్ అనే ఓ ప్రేమ కథ తమిళ్ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. డి గ్లామర్ లుక్ లో ఈ సినిమాలో ఆమె కనిపించి తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
ఈ సినిమా హిట్ అవ్వడంతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఆనందికి కాయల్ ఆనంది అని పేరు వచ్చేసింది. ఆనంది ఈ మధ్యకాలంలో శివంగి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భైరవం సినిమాతో కూడా ఆనంది త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ మల్టీస్టారర్ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ ఇంకా తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. భైరవం సినిమాకు విజయ్ కనకమెడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆనంది తో పాటు అదితి శంకర్, దివ్య పిళ్ళై కూడా హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భైరవం సినిమా మే 30వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.