Tollywood: సినిమా అంటే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే నిత్యం పోటీ పడుతూనే ఉండాలి. ట్యాలెంట్ కు పదును పెట్టుకుంటూ కొత్త ట్యాలెంట్ తో దూసుకు వస్తున్న వారితో పోరాడితేనే అవకాశాలు దక్కుతాయి. లేకపోతే ఎంత పెద్ద స్టార్ గా వెలుగు వెలిగినా.. అవకాశాలు మాత్రం రావు. ఇలా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత దీన పరిస్థితులు అనుభవించిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ముందుగా కస్తూరి శివరామ్ ఉంటాడు. ఈయన ఒకప్పటి తరానికి బాగా దగ్గరయిన వ్యక్తి. ఆయన అవకాశాలు ఉన్నప్పుడు మంచి స్థాయిలో ఉన్నా.. ఆ తర్వాత ఛాన్సులు రాక దీనవస్తలు పడుతూ.. చివరకు అనాథగా మరణించాడు.

ఇక ఐరన్ లెగ్ శాస్త్రి అంటే ఇప్పటి తరానికి కూడా బాగానే పరిచయం. ఈయన ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా అలరించాడు. కాగా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయారు. అవకాశాలు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఇక పొట్టి ప్రసాద్ కూడా ఇలాంటి కోవలోకే వస్తారు. నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన ఈయన.. సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కానీ రాను రాను కమెడియన్‌గా చాన్సలు దొరక్క కనుమరుగైపోయారు.

Also Read: పనిలో చేరిన వంటలక్క, డాక్టర్ బాబు.. ఇకపై సంతోషాలేనా?
ఇక హీరోగా తొలితరంలో రాణించిన నాగయ్య కూడా ఇలాగే దీనావస్థలు పడ్డాడు. ఈయన హీరోగా రాణించి చాలా డబ్బులు సంపాదించాడు. కానీ అడిగిన వారికి లేదనకుండా దానాలు చేసి చివరకు ఆస్తి మొత్తం కరిగించుకున్నాడు. చనిపోయే రోజుల్లో అయితే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు నాగయ్య. ఇక నటి రమాప్రభ కూడా ఇప్పుడు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈమె కూడా మొదట్లో స్టార్ గా వెలుగొందారు.

ఆ తర్వాత సైడ్ రోల్స్‌కే పరిమితం అయ్యారు. ఇప్పటికీ అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నా.. అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇక ఈమెతో కెరీర్ స్టార్ట్ చేసిన కమెడియన్ రాజబాబు కూడా మంచి స్థాయికి వచ్చి.. ఆ తర్వాత కిందకు పడిపోయారు. ఇలా వీరే కాకుండా కాంతారావు, పద్మనాభం, వల్లూరి బాలకృష్ణ లాంటి ఎంతో మంది తక్కువ టైమ్ లోనే స్టార్‌గా ఎదిగి.. ఆ తర్వాత తెరమరుగైన వారు చాలామంది ఉన్నారు.

Also Read: శనివారం శనీశ్వరునికి ఇలా చేస్తే.. మీ సమస్యలు తొలగిపోవడం ఖాయం!
[…] Also Read: ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగి.. … […]
[…] Also Read: ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగి.. … […]