https://oktelugu.com/

Murali Sharma Biography : సినీ సెలబ్రిటీ బయోగ్రఫీ : ఈ క్రేజీ విలన్ భార్య ఓ లేడీ విలన్, తల్లిది గుంటూరు… మురళీశర్మ షాకింగ్ సీక్రెట్స్!

Murali Sharma Biography : పాత్రలో పరకాయ ప్రవేశం చేయగల అతి కొద్దిమంది నటుల్లో మురళీశర్మ ఒకరు. ఈ తరం బెస్ట్ యాక్టర్ అనడంలో సందేహం లేదు. కరుడుగట్టిన విలన్ గా కరుణ పంచే తండ్రిగా నటించి మెప్పించగల విలక్షణ నటుడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మురళీశర్మ మారిపోయారు. ఈ మధ్య కాలంలో విడుదలైన ప్రతి సినిమాలో మురళీశర్మ ఉంటున్నారు. త్రివిక్రమ్ తో పాటు పలువురు స్టార్ డైరెక్టర్స్ ఫేవరేట్ ఛాయిస్ అయ్యారు. విలన్ గా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 29, 2023 / 05:51 PM IST
    Follow us on

    Murali Sharma Biography : పాత్రలో పరకాయ ప్రవేశం చేయగల అతి కొద్దిమంది నటుల్లో మురళీశర్మ ఒకరు. ఈ తరం బెస్ట్ యాక్టర్ అనడంలో సందేహం లేదు. కరుడుగట్టిన విలన్ గా కరుణ పంచే తండ్రిగా నటించి మెప్పించగల విలక్షణ నటుడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మురళీశర్మ మారిపోయారు. ఈ మధ్య కాలంలో విడుదలైన ప్రతి సినిమాలో మురళీశర్మ ఉంటున్నారు. త్రివిక్రమ్ తో పాటు పలువురు స్టార్ డైరెక్టర్స్ ఫేవరేట్ ఛాయిస్ అయ్యారు. విలన్ గా మొదలుపెట్టి అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మురళీశర్మ మారారు. ముంబైకి చెందిన మురళీశర్మలో తెలుగు మూలాలు ఉన్నాయి. అందుకే ఆయన అంత అనర్గళంగా మాట్లాడుతారు.

    బాల్యం-విద్యాభ్యాసం

    1972 ఆగస్టు 9న మురళీశర్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించారు. శర్మ తండ్రి పేరు వ్రిజ్భూషణ్ శర్మ. ఆయన మరాఠీ. తల్లి పేరు పద్మ శర్మ. ఈమె తెలుగువారు. ముంబైలో పెరిగిన మురళీశర్మ అక్కడే డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి నటనపై మక్కువ పెంచుకున్నాడు. చదువు పూర్తి కాగానే ఆలస్యం చేయకుండా యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకున్నాడు. రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్ ముంబై నందు శిక్షణ తీసుకున్నారు. అనంతరం అవకాశాల కోసం వేట మొదలుపెట్టారు.

    సినీ కెరీర్

    అవకాశాల వేటలో మురళీశర్మ అనేక కష్టపడ్డారు. ఆఫర్స్ కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగారు. 2002లో మొదటిసారి ఆయనకు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే అవకాశం దక్కింది. దిల్ విల్ ప్యార్ వ్యార్ నటుడిగా ఆయనకు మొదటి సినిమా. అనంతరం రాజ్ మూవీలో పోలీస్ రోల్ చేశారు. అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్న మురళీశర్మ హిందీలో బిజీ అయ్యారు. ఆయనకు వరుస ఆఫర్స్ వచ్చాయి.

    కెరీర్ మొదలైన ఐదేళ్లకు 2007లో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. మహేష్-సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అతిథి మూవీలో మెయిన్ విలన్ గా నటించారు. రెండు భిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో మురళీశర్మ అద్భుతం చేశాడు. డాన్, పోలీస్ రోల్స్ లో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకర్షించారు. అతిథి మూవీకి మురళీశర్మ నంది అవార్డు అందుకున్నారు. సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. అందుకే ఆయనకు తెలుగులో ఆఫర్స్ రాలేదు. అదే సమయంలో హిందీలో బిజీగా ఉన్న మురళీశర్మ టాలీవుడ్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు.

    2011లో ఊసరవెల్లి మూవీతో సురేంధర్ రెడ్డి మురళీశర్మకు ఓ రోల్ ఆఫర్ చేశారు. గత ఐదేళ్లుగా మురళీశర్మ టాలీవుడ్ లో బిజీ అయ్యారు. ఫుల్ టైం ఇక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో అనేక బ్లాక్ బస్టర్స్ లో నటించారు. ప్రస్తుతం తెలుగులో ఆయన హైయెస్ట్ పెయిడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. తెలుగు అనర్గళంగా మాట్లాడటం, చక్కని డైలాగ్ డెలివరీ ఆయనకు ప్లస్.

    మురళీశర్మ భార్య అశ్విని కల్సేకర్ కూడా నటి. ఆమె హిందీ, మరాఠీ చిత్రాల్లో నటిస్తారు. తెలుగులో బద్రీనాథ్ చిత్రం చేశారు. లేడీ విలన్ గా ఆమె బద్రీనాథ్ చిత్రంలో పవర్ఫుల్ పాత్ర చేశారు. ఇవి మన మురళీశర్మకు సంబంధించిన ఆసక్తికర విషయాలు.