Actor Vijay Son Jason Sanjay: తమిళ స్టార్ హీరో విజయ్ వారసుడు ‘జాసన్ సంజయ్’ని వెండి తెరపై చూడాలని అభిమానులు చాలా కాలంగా ఆశ పడుతున్నారు. అయితే అది అందరి ద్రాక్షగానే మిగిలిపోతోంది. దర్శకుడు మణిరత్నం, శంకర్ నుంచి మురగదాస్ వరకూ చాలామంది పేర్లు జాసన్ సంజయ్ ఎంట్రీ సినిమా కోసం పరిశీలనకు వచ్చాయి. అయితే.. అవేం కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు మరో దర్శకుడి పేరు తెరపైకొచ్చింది. తనే….వెట్రిమారన్. ఖైదీ, నారప్ప లాంటి చిత్రాలతో అద్భుతంగా ఆకట్టుకొన్నాడు వెట్రిమారన్. ఇప్పుడు దళపతి విజయ్ వారసుడు జాసన్ సంజయ్ కోసం ఓ కథ తయారు చేశాడని తెలుస్తోంది. ఇటీవల విజయ్ ని కలిసి కథ వినిపించాడని, ఈ ప్రాజెక్టు దాదాపుగా ఖాయమని సమాచారం అందుతుంది.
ఇదో లవ్ స్టోరీ అని 2023 ప్రధమార్థంలో పట్టాలెక్కుతుందని, ఈ కథలో జాసన్ సంజయ్ ఒక స్టూడెంట్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు. విజయ్ ది పక్కా మాస్ ఇమేజ్. అయితే.. జాసన్ సంజయ్ ని సరికొత్తగా, ఈ ఇమేజ్‌కు దూరంగా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే వెట్రిమారన్ లవ్ స్టోరీని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. అయితే, వెట్రిమారన్ కి పేరు వచ్చిందే యాక్షన్ సినిమాలతో.
మరి, ఈ యాక్షన్ డైరెక్టర్.. స్టార్ హీరో వారసుడితో లవ్ స్టోరీ ఏం తీస్తాడు ? చూడాలి. ఐతే, జాసన్ సంజయ్ 2009 లో విడుదలైన “వెట్టైకారణ్” అనే చిత్రంలో తన తండ్రి విజయ్ పాటు నటించాడు. ఈ సినిమా బాగానే ఆడింది. జాసన్ సంజయ్ కి కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా స్టార్ అయ్యే లక్షణాలు జాసన్ సంజయ్ కి పుష్కలంగా ఉన్నాయని విమర్శకులు అభినందించారు.

పైగా వెట్రిమారన్ తో జాసన్ సంజయ్ తన మొదటి సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్య కాలంలో సౌత్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుల లిస్ట్ లో ముందువరుసలో నిలిచే పేరు తమిళ దర్శకుడు ‘వెట్రిమారన్’. ఇలాంటి దర్శకుడితో సినిమా అంటే.. జాసన్ సంజయ్ కెరీర్ కి భారీ లాంచ్ దొరికినట్టే