Actor Sudheer Babu: 2010లో ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. 2012లో ఎస్ఎమ్ఎస్ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. అతడిని హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం ప్రేమకథా చిత్రమ్ అనే చెప్పుకోవాలి. ఈ హర్రర్ మూవీ అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తరువాత చాలా సినిమాలు చేసినప్పటికీ ఏవీ పెద్దగా ఆడలేదు. 2016లో హిందీసినిమా బాగీలో విలన్ గా తొలిసారి హిందీ సినిమా చేశాడు. ఆ మధ్య కాలంలో రిలీజ్ అయిన సమ్మోహనం సినిమా కాస్త ఆడినట్టే కనిపించింది కానీ డబ్బులు రాబట్టుకోలేకపోయింది. ఇక అతని తాజా సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు సుధీర్ బాబు.

తాజాగా సుధీర్ బాబు ఇప్పుడు తన పదిహేనో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాను ఆయన దర్శకుడు హర్షవర్ధన్ తో చేయబోతున్నాడు. హర్షవర్ధన్ తెలుగు పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి పతాకంపై దీన్ని నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు దర్శకుడు హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో జరిగాయి. ముహూర్తపు షాట్‌కు నిర్మాత రామ్‌మోహన్ రావు క్లాప్ కొట్టారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి రెగ్యులర్‌గా జరుగుతుంది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదని… హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయాల్సి ఉందని వెల్లడించారు.
Clicks from the Pooja Ceremony of Hero @isudheerbabu & Prestigious Banner @SVCLLP's #ProdNo5
💥 #Sudheer15 💥
Presented by : Sonali Narang and Srishti
Clap by 🎬: #RamMohan
Shoot Begins next week !
Produced by: #NarayanDasNarang #PuskurRamMohanRao
Directed by : @HARSHAzoomout pic.twitter.com/dc2OR5TTCq— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) December 20, 2021