Actor Shivaji: ఒకప్పుడు హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టు గా మంచి పేరు తెచ్చుకున్న శివాజీ(Sivaji), మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దాదాపుగా పదేళ్ల పాటు దూరమయ్యాడు. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు, జనాలకు బాగా దగ్గరవ్వడం కోసం బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, మైండ్ గేమ్ అంటే ఏంటో చూపించిన మాస్టర్ మైండ్ కంటెస్టెంట్ గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, టాప్ 3 కంటెస్టెంట్ గా బయటకు వచ్చాడు. బయటకి వచ్చిన తర్వాత ఆయన రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ ఈ జనరేషన్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఈ ఏడాది ‘కోర్ట్’ సినిమాలో మంగపతి క్యారక్టర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి, సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్న శివాజీ, ఇప్పుడు దండోరా చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు.
ఈ నెల క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ఒక అమ్మాయికి అందం చీర మాత్రమే. చీరలోనే ఒక స్త్రీ దేవత లాగా కనిపిస్తుంది. సమన్లు కనిపించే బట్టల్లో అందం కనిపించదు. చూసే ఆడియన్స్ కి దరిద్రపు ముం*** ఎలాంటి బట్టలో కనిపిస్తుందో చూడండి, కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చు గా అని అనాలనిపిస్తుంది. ఇలా మాట్లాడితే స్త్రీల మనోభావాలు దెబ్బ తిని, స్వేచ్ఛ అని అంటారు, స్త్రీ అంటే ప్రకృతి తో సమానం, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది’ అంటూ శివాజీ మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాలకు దారి తీస్తున్నాయి.
ఈ కామెంట్స్ ని చూసిన కొంతమంది నెటిజెన్స్, శివాజీ గారు ఇంకా మంగపతి క్యారక్టర్ నుండి బయటకు వచ్చినట్టు లేదు. కాస్త క్యారెక్టర్ నుండి బయటకు రండి, ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవి, ఇలా మాట్లాడే అర్హత మనకు ఏ మాత్రం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యూత్ ఆడియన్స్ ఇలాగే మాట్లాడుతారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం శివాజీ మాటలకు ఏకీభవిస్తారు. ఆయన చెప్పిన దాంట్లో నిజముంది కదా, ఈమధ్య కాలంలో హీరోయిన్స్ హద్దులు దాటేస్తున్నారు. స్త్రీ సమాజం సిగ్గు పడే స్థాయి బట్టలు ధరిస్తున్నారు, వీళ్ళను చూసి చిన్న పిల్లలు చెడిపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా శివాజీ నిన్నటి ఈవెంట్ ద్వారా మంచి ట్రోల్ స్టఫ్ ఇచ్చాడు అనే చెప్పాలి. దండోరా చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ ని కూడా ఈ ప్రసంగం తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.