https://oktelugu.com/

ఆ నటుడు బక్క చిక్కిపోవడానికి కారణం ఇదే !

నటుడు శివాజీ రాజా రూపం ఒకప్పుడు బొద్దుగా ఉండేది. కానీ, ప్రస్తుతం ఆయన బాగా బక్క చిక్కి పోయారు. కారణం ఇదే అంటూ రోజుకో రూమర్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది సంబంధం లేని పుకార్లను కూడా పుటిస్తున్నారు. కానీ అవన్నీ ఒట్టి అవాస్తవం. అసలు శివాజీ రాజా ఆరోగ్యం వెనుక జరిగింది ఏమిటంటే.. గతేడాది ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే అప్పటి నుండి శివాజీ రాజా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో చాలా […]

Written By:
  • admin
  • , Updated On : July 7, 2021 / 01:37 PM IST
    Follow us on

    నటుడు శివాజీ రాజా రూపం ఒకప్పుడు బొద్దుగా ఉండేది. కానీ, ప్రస్తుతం ఆయన బాగా బక్క చిక్కి పోయారు. కారణం ఇదే అంటూ రోజుకో రూమర్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది సంబంధం లేని పుకార్లను కూడా పుటిస్తున్నారు. కానీ అవన్నీ ఒట్టి అవాస్తవం. అసలు శివాజీ రాజా ఆరోగ్యం వెనుక జరిగింది ఏమిటంటే.. గతేడాది ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు.

    అయితే అప్పటి నుండి శివాజీ రాజా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో చాలా గ్యాప్ తరువాత ఆయన బయట కనిపించడం, దానికి తోడు పూర్తిగా తగ్గిపోయి కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. వాస్తవానికి శివాజీ రాజాకు గుండెపోటు వచ్చాక కావాలనే బరువు తగ్గారు. అలాగే ఆయన ప్రస్తుతం తన ఆరోగ్యం పై దృష్టి పెట్టారు.

    ఈ క్రమంలోనే ఆయన బాగా తగ్గారు. అంతేకాని శివాజీ రాజా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రేక్షకులు ఆయన ఆరోగ్యం విషయంలో కంగారు పడొద్దు అంటూ ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా కాస్తా బోద్దుగా ఉండే శివాజీ రాజా ఇలా బాగా చిక్కిపోయి దర్శనం ఇవ్వడంతో అందరూ షాక్‌ అవతున్నారు. అందుకే ప్రెజెంట్ శివాజీ రాజా లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

    ఇక సినిమాల విషయానికి వస్తే.. శివాజీ రాజా సినిమాలు కూడా తగ్గించారు, నిజానికి తగ్గించారు అనేకంటే.. సినిమాలు రావడమే తగ్గింది అనడం కరెక్ట్. శివాజీ రాజా 35 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు. కామెడియన్‌ గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

    అన్నట్టు శివాజీ రాజా తనయుడు వినయ్‌ రాజా కూడా హీరోగా నిలబడటానికి కిందామీదా పడుతున్నాడు. కాకపోతే అతగాడు కూడా తన తండ్రికి మల్లే హీరో మెటీరియల్ కాదు. అయినా ‘వేయు శుభములు కలుగు నీకు’ అంటూ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.