Rahul Ramakrishna : రాహుల్ రామకృష్ణ ఈ జనరేషన్ సినిమా లవర్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణా మాండలికంలో రాహుల్ రామకృష్ణ చేసే కామెడీ చాలా సహజంగా ఉంటుంది. సీరియస్ రోల్స్ కూడా అద్భుతంగా పండించగల రాహుల్ రామకృష్ణ ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి దాయకం. షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ స్టార్ కమెడియన్ అయ్యాడు. ఆయన నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సైన్మా’ రాహుల్ రామకృష్ణకు గుర్తింపు తెచ్చింది. వెండితెర కెరీర్ కి బాటలు వేసింది మాత్రం అర్జున్ రెడ్డి మూవీ. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా విడుదలైన అర్జున్ రెడ్డి అతిపెద్ద సంచలనం.
ఈ మూవీలో హీరో మిత్రుడు శివ రోల్ రాహుల్ రామకృష్ణ చేశాడు. రాహుల్ రామకృష్ణ సీరియస్ నెస్ కూడా కామెడీ పంచేలా ఆయన పాత్ర ఉంటుంది. చెడిపోతున్న మిత్రుడి కోసం ఆవేదన చెందే పాత్రలో అలరించాడు. అర్జున్ రెడ్డి విజయం హీరో విజయ్ దేవరకొండను స్టార్ చేస్తే, రాహుల్ రామకృష్ణకు కెరీర్ ఇచ్చింది. అయితే అర్జున్ రెడ్డి మూవీలో హీరో ఫ్రెండ్ శివ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ రాహుల్ రామకృష్ణ కాదట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
ఓ టాక్ షోలో పాల్గొన్న రాహుల్ రామకృష్ణ తనకు అర్జున్ రెడ్డి మూవీ అవకాశం ఎలా వచ్చిందో తెలియజేశారు. నేను పుట్టి పెరిగింది హిమాయత్ నగర్లోనే. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, ప్రియదర్శి, నేను ఒకేసారి పరిశ్రమకు వచ్చాం. అందరం కలిసి ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళం. తరుణ్ భాస్కర్ కి దర్శకుడిగా ‘పెళ్లి చూపులు’ మూవీ ఆఫర్ వచ్చింది. హీరోగా విజయ్ దేవరకొండను హీరోగా ఎంచుకున్న తరుణ్ భాస్కర్ ఫ్రెండ్ రోల్ ప్రియదర్శికి ఇచ్చాడు.
ఇక సందీప్ రెడ్డి వంగాకి అర్జున్ రెడ్డి మూవీ ఛాన్స్ వచ్చింది. హీరోగా విజయ్ దేవరకొండకు అవకాశం ఇచ్చాడు. విజయ్ దేవరకొండ నా మిత్రుడు కావడంతో నన్ను సందీప్ రెడ్డి వంగాకు పరిచయం చేశాడు. అలా నాకు అర్జున్ రెడ్డి మూవీలో హీరో ఫ్రెండ్ ఆఫర్ దక్కింది. అయితే ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు తెలిసింది. సందీప్ రెడ్డి నేను చేసిన పాత్రకు ప్రియదర్శిని అనుకున్నారట, అని రాహుల్ రామకృష్ణ అసలు విషయం బయటపెట్టారు. కాగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చాయి. బ్రోచేవాడెవడురా, జాతిరత్నాలు చిత్రాల్లో హీరోకి సమానమైన పాత్రలు వీరిద్దరూ చేయడం విశేషం.